KTR PA Interrogation: కేటీఆర్ పిఏ, పీఆర్‌ఓల విచారణలో ఉద్రిక్తత.. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు సిద్ధమైన పోలీసులు.. న్యాయవాదుల ఆగ్రహం
అసెంబ్లీ ఎదుట జరిగిన వివాదాస్పద ఘటనపై సత్వర విచారణ(KTR PA Interrogation) జరిపేందుకు సైఫాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు.
- V Santhosh Kumar
- Published on- September 14, 2026 / 03:30 PM IST
Saifabad police investigating ktr pa and pro regarding telangana assembly incident
- కేటీఆర్ పిఏ పీఆర్‌ఓల విచారణ
- సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు సైఫాబాద్ పోలీసులు
- పోలీసులతో న్యాయవాదుల తీవ్ర వాగ్వాదం
KTR PA Interrogation: తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్న కేటీఆర్ పిఏ, పీఆర్‌ఓల వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎదుట జరిగిన వివాదాస్పద ఘటనపై సత్వర విచారణ జరిపేందుకు సైఫాబాద్ పోలీసులు రంగంలోకి దిగగా, విచారణ సాగుతున్న తీరుపై లాయర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య చోటుచేసుకున్న తీవ్ర వాగ్వాదంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
AP Government: ఏపీలోని పేదలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉచితంగా ఇళ్ల పట్టాలు.. పంపిణీ ఎప్పుడంటే?
వేర్వేరు గదుల్లో విచారణ.. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు ప్లాన్:
కేటీఆర్ పిఏ(KTR PA Interrogation) మహేందర్, పీఆర్‌ఓ మహేష్‌లను పోలీసులు వేర్వేరు గదుల్లో ఉంచి రహస్యంగా విచారిస్తున్నారు. అసెంబ్లీ ఎదుట అసలు ఏం జరిగిందనే కోణంలో స్పష్టత తెచ్చుకునేందుకు, వారిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయడానికి పోలీసులు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు.
హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన.. లాయర్ల తీవ్ర ఆగ్రహం:
కాగా, విచారణ సమయంలో న్యాయవాదులను పక్కకు పెట్టడంపై లాయర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఈ విచారణ జరుగుతోందని, ముందుగా నోటీసులు ఇవ్వకుండా సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు ఎలా తీసుకెళ్తారని వారు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
