VC Sajjanar: హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్ .. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు
VC Sajjanar : తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు జరిగాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ నియామకం అయ్యారు.
- Harishth Thanniru
- Published On : September 27, 2025 / 08:56 AM IST
VC Sajjanar
VC Sajjanar : తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్, 23మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ కమిషనర్‌గా కొనసాగుతున్న సీవీ ఆనంద్.. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు. దీంతో ఆయన స్థానంలో హైదరాబాద్ సిటీ కమిషనర్‌గా వీసీ సజ్జనార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. బదిలీల్లో భాగంగా ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డిని ప్రభుత్వం నియమించింది.
♦ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా శిఖా గోయల్
♦ ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీగా ఉన్న చారుసిన్హాకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు
♦ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా స్వాతిలక్రాకు అదనపు బాధ్యతలు
♦ ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి
♦ ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్
♦ ఫౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీగా స్టీఫెన్ రవీంద్ర
♦ గ్రేహౌండ్స్ ఆక్టోపస్ అదనపు డిజీగా అనిల్ కుమార్
♦ మల్టీజోన్ 2 ఐజీగా డీఎస్ చౌహన్
♦ విపత్తు నిర్వహణ, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్
♦ హైదరాబాద్ నేర విభాగ అదనపు సీపీగా శ్రీనివాసులు
♦ హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్‌గా తఫ్సీర్ ఇక్బాల్
♦ సిద్దిపేట కమిషనర్‌గా ఎస్.ఎమ్ విజయ్ కుమార్
♦ ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సింధు శర్మ
♦ నారాయణపేట ఎస్పీగా జి. వినీత్
♦ ఎల్బీనగర్ డీసీపీగా బి. అనురాధ
♦ ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సీహెచ్ ప్రవీణ్ కుమార్
♦ రాజేంద్రనగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్
♦ వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్
♦ మాదాపూర్ డీసీపీగా రితు రాజ్
♦ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్‌గా రవి గుప్తా
