Medaram Jatara 2024: సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రూ.75 కోట్ల నిధులు మంజూరు చేశారు: మంత్రి సీతక్క

అప్పట్లో రేవంత్ రెడ్డి పాదయాత్రను మేడారం దేవతల సన్నిధి నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. జాతరను విజయవంతం..

seethakka-medaram

Seethakka: ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర సమ్మక్క, సారలమ్మ జాతరను జయప్రదం చేస్తామని తెలంగాణ మంత్రి సీతక్క చెప్పారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లపై తెలంగాణ మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఆ తర్వాత సీతక్క మీడియాకు వివరాలు తెలిపారు. ఫిబ్రవరి 21 నుండి జాతర ప్రారంభం అవుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 75 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని ఆమె వివరించారు. అవసరమైతే మరిన్ని నిధులు కావాలని ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు.

అప్పట్లో రేవంత్ రెడ్డి పాదయాత్రను మేడారం దేవతల సన్నిధి నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. జాతరను విజయవంతం చేయడానికి ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని పనులకోసం ప్రతిపాదనలు పంపామని వివరించారు.

మేడారం జాతరకు జాతీయ హోదా కోసం విజ్ఞప్తి పంపుతున్నట్లు తెలిపారు. కాగా, ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తామని కొన్ని నెలల క్రితమే పూజారులు ప్రకటించారు. 24న సమ్మక్క, సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగులమ్మల వన ప్రవేశం ఉంటుంది. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ జాతర జరుగుతుంది. రెండేళ్లకు ఓ సారి జాతరను నిర్వహిస్తారు. పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.

Bank Info: డిసెంబర్ 31 లోపు ఈ ఐదు పనులు తప్పనిసరిగా చేయండి. లేదంటే కష్టాల్లో పడతారు

ట్రెండింగ్ వార్తలు