×
Ad

సెల్ఫీ విత్‌ సద్దుల బతుకమ్మ.. 10టీవీకి వాట్సాప్‌ చేయండి.. స్పెషల్‌ గిఫ్ట్‌ను సొంతం చేసుకోండి..

ఈ బతుకమ్మ పండుగను 10టీవీతో కలిసి మరింత ఉత్సాహంగా జరుపుకుందాం.

Saddula Bathukamma Selfie

Bathukamma selfie contest: తెలంగాణ సాంప్రదాయ పండుగల్లో అగ్రగామి బతుకమ్మ వేడుకలు ఈసారి మరింత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గ్రామాల నుంచి నగరాల వరకు ఎక్కడ చూసినా పూల పరిమళాలు వెదజల్లుతున్నాయి. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మతో మహిళలు, బాలికలు గౌరమ్మను ఆరాధిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.

ఈ పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచడానికి 10టీవీ ప్రత్యేక కార్యక్రమాన్ని మీ ముందుకు తెచ్చింది. “సెల్ఫీ విత్‌ సద్దుల బతుకమ్మ” పేరుతో ప్రతి ఒక్కరికి ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. మీరు మీ ఇంటి వద్ద, కాలనీ, గేటెడ్‌ కమ్యూనిటీ లేదా స్నేహితులు, బంధువులతో కలిసి అలంకరించిన బతుకమ్మతో దిగిన ఫొటోను పంపితే, ఆ ఫొటో 10టీవీలో ప్రసారం అవుతుంది.

అంతేకాదు.. మీరు పంపిన ఫొటో లక్కీడ్రాలో ఎంపికైతే ప్రత్యేక గిఫ్ట్‌ కూడా అందుకోవచ్చు. పండుగ సందడి మధ్యలో బతుకమ్మ అందాలను స్మృతులుగా నిలుపుకునే ఈ అవకాశం మిస్‌ కాకండి. (Bathukamma selfie contest)

ఎలా పాల్గొనాలి?

మీ ఇంట్లో లేదా కాలనీలో సద్దుల బతుకమ్మతో ఓ సెల్ఫీ తీసుకోండి..

ఆ ఫొటోతో పాటు మీ పేరు, పూర్తి చిరునామా రాయండి..

వాట్సాప్‌ నంబర్‌ 84980 33333 కు పంపండి..

మీరు పంపిన సెల్ఫీలు 10టీవీలో ప్రసారం కానున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని మీ కుటుంబంతో, స్నేహితులతో పంచుకోవడానికి ఇదే సరైన సమయం.

వెంటనే ఓ సెల్ఫీ తీసి పంపండి.. లక్కీడ్రాలో స్పెషల్‌ గిఫ్ట్‌ కూడా మీ సొంతం అవుతుంది. ఈ బతుకమ్మ పండుగను 10టీవీతో కలిసి మరింత ఉత్సాహంగా జరుపుకుందాం.