×
Ad

Jeevan Reddy: నేను ఏం పాపం చేశాను.. మాజీమంత్రి జీవన్ రెడ్డి కంటతడి

పార్టీ ఫిరాయిస్తే రాళ్ళతో కొట్టండి అని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారన్న జీవన్ రెడ్డి.. ప్రజలారా ఫిరాయింపుదారులను ఓటు అనే ఆయుధంతో కొట్టండి అని అన్నారు.

  • Published On : February 6, 2026 / 04:49 PM IST
  • నా మీద కోపం నన్ను నమ్ముకునోళ్ల మీద తీసుకున్నారు
  • పార్టీ ఫిరాయిస్తే రాళ్ళతో కొట్టండి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు
  • ఫిరాయింపుదారులను ఓటు అనే ఆయుధంతో కొట్టండి

Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కంటతడి పెట్టారు. నేను ఏం పాపం చేశాను, నన్ను ఎందుకు గోస పోసుకుంటున్నారు అని వాపోయారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ చెట్టు నీడన ఉన్నాను, నా మీద కోపం నన్ను నమ్ముకునోళ్ల మీద తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను నమ్ముకున్న వారి కోసం కొట్లాడతానని చెప్పారు. పార్టీ ఫిరాయిస్తే రాళ్ళతో కొట్టండి అని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారన్న జీవన్ రెడ్డి.. ప్రజలారా ఫిరాయింపుదారులను ఓటు అనే ఆయుధంతో కొట్టండి అని అన్నారు. పదేళ్లు కష్టపడిన కార్యకర్తల తినే కాడి పళ్ళెం ఫిరాయింపుదారులు ఎత్తుకెళ్లారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. మేము నిజమైన కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు.

మున్సిపల్ ఎన్నికల టికెట్ల వ్యవహారం జగిత్యాల కాంగ్రెస్ లో చిచ్చు రాజేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి ఎక్కువ టికెట్లు ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న తన వర్గానికి కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి తప్పుపడుతున్నారు. పార్టీ నమ్ముకున్న వారికి, పార్టీ జెండా మోసిన వారికి కాకుండా బయటి నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు.

Also Read: మూడు నెలల్లో కొత్త పార్టీ.. బీఆర్‌ఎస్‌ ప్రచారం అంత యాక్టివ్‌గా లేదు- కవిత