Shamshabad : శంషాబాద్ పరిధిలో ఉద్రిక్తత.. బుల్లెట్ ట్రైన్ మాకొద్దు.. అధికారులను అడ్డుకున్న రైతులు.. టెన్షన్ టెన్షన్
Shamshabad Bullet Train Land Issue : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్‌గూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రా అధికారులకు, స్థానిక రైతులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.
- Harish Thanniru
- Updated on- July 18, 2026 / 10:25 AM IST
Shamshabad bullet train Land Issue
- శంషాబాద్ పరిధి బహదూర్‌గూడలో ఉద్రిక్తత
- హైడ్రా, రెవెన్యూ అధికారులను అడ్డుకున్న రైతులు
- స్పృహతప్పి పడిపోయిన రైతు
Shamshabad Bullet Train Land Issue : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్‌గూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరించిన స్థలంలో కంచె వేసేందుకు రెవెన్యూ, హైడ్రా అధికారులు వెళ్లగా.. స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Also Read : Sonam Wangchuk : సోనం వాంగ్‌చుక్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలింపు..
బుల్లెట్ ట్రైన్ కోసం స్థానిక రైతుల భూములను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో గత ఎనిమిది రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తాము భూములు ఇవ్వాలంటే స్పష్టమైన హామీలు, తగిన పరిహారం ప్రకటించాలని.. ఆ తరువాతనే తమ భూములు ఇస్తామని రైతులు పేర్కొంటున్నారు. అయితే, శనివారం ఉదయం హైడ్రా, రెవెన్యూ శాఖల అధికారులు బహదూర్ గూడలోని రైతుల భూముల వద్దకు రావడంతో రైతులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, స్థానికులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓ రైతు స్పృహతప్పి పడిపోవటంతో అతన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. తోటి రైతులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేశాకే తమ పొలాల వద్ద కంచె వేయాలని స్థానికులు, రైతులు డిమాండ్ చేశారు.
650 ఎకరాల భూమికి హైడ్రా సాయంతో కంచె వేసేందుకు వచ్చిన అధికారులతో రైతులు తీవ్ర వాగ్వివాదంకు దిగారు. ఉధ్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం అధికారులు రైతులతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే, తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. దీంతో బహుద్దుర్‌గుడా భూముల వ్యవహారం మరింత కీలకంగా మారింది.అధికారులు, రైతుల మధ్య చర్చలు ఎలాంటి ఫలితాన్నిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
