వారెవ్వా.. 2023లో చనిపోయిన వ్యక్తికి 2024లో పెళ్లి.. ‘కల్యాణ లక్ష్మి’ కూడా అప్లై చేశారు.. చివరికి..

కల్యాణలక్ష్మి పథకం కోసం చనిపోయిన వ్యక్తికి ఏడాది తర్వాత పెళ్లి జరిపించి, నకిలీ పత్రాలతో ప్రభుత్వ(Kalyana Lakshmi Scam) సొమ్మును దోచుకున్న వైనం భద్రాద్రి జిల్లాలో కలకలం రేపింది.

Shocking scam dead man get marriage certificate in telangana for kalyana lakshmi scheme

  • చనిపోయిన వ్యక్తికి పెళ్లి చేశారు.
  • కల్యాణలక్ష్మి పథకం కోసం మోసం.
  • నకిలీ మ్యారేజీ సర్టిఫికెట్ సృష్టించారు.

Kalyana Lakshmi Scam: కల్యాణలక్ష్మి పథకం కోసం చనిపోయిన వ్యక్తికి ఏడాది తర్వాత పెళ్లి జరిపించి, నకిలీ పత్రాలతో ప్రభుత్వ సొమ్మును దోచుకున్న(Kalyana Lakshmi ) వైనం భద్రాద్రి జిల్లాలో కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం గ్రామానికి చెందిన పట్నాల సాయి కుమార్ 2019లోనే ఇదునూరి సాయి ప్రసన్నను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సాయి కుమార్ 2023 సెప్టెంబర్ 19న ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై మణుగూరు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

*Schools Bandh: ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు బంద్..

అయితే ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి(Kalyana Lakshmi Scam) పథకం నగదును కొట్టేయడానికి కొందరు అడ్డదారులు తొక్కారు. 2023లో చనిపోయిన సాయి కుమార్‌ను ఏడాది తర్వాత బతికించి, 2024 మే 20న సాయిప్రసన్నతో మళ్లీ పెళ్లి జరిగినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. భూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నిబంధనలను తుంగలో తొక్కి ఈ మ్యారేజీ సర్టిఫికెట్‌ను ధ్రువీకరించడం గమనార్హం.

ఈ నకిలీ పత్రాలను ఎలాంటి పరిశీలన లేకుండానే రెవెన్యూ అధికారులు ఓకే చేయడంతో, సాయిప్రసన్న తల్లి సత్యవతి పేరిట కల్యాణలక్ష్మి చెక్కు కూడా జారీ అయిపోయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెళ్లి జంట, పెద్దల సాక్షి సంతకాలు లేకుండానే ఈ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ దొంగ పత్రాల వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.