Schools Bandh: ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు బంద్..
ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల బంద్కు(Schools Bandh) పిలుపునిచ్చింది.
Abvp calls for telangana schools bandh on june 23
- ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ.
- ఈ నెల 23న పాఠశాలల బంద్.
- విద్యాసంస్థల మూసివేతకు పిలుపునిచ్చిన ఏబీవీపీ.
Schools Bandh: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయని, వీటికి రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముకాస్తోందని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తీవ్రంగా ఆరోపించింది. ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల బంద్కు(Schools Bandh) పిలుపునిచ్చింది.
CURE-1 In Telangana: ఇక నుంచి అన్ని బిల్లులు ఒకేచోట.. తెలంగాణలో ‘క్యూర్-1’ వ్యవస్థ..
ఈ బంద్కు సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలను హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనివల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై మోయలేని భారం పడుతోందని మండిపడ్డారు.
ప్రైవేట్ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కొరత, ఫీజుల దోపిడీపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించని పక్షంలో విద్యార్థి లోకాన్ని ఏకం చేసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఈ నెల 23న జరగబోయే పాఠశాలల బంద్ ను విద్యాసంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు జయప్రదం చేయాలని కోరింది.
