Half Day Schools: స్కూల్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో ఒంటిపూట బడులు..

ప్రతీయేటా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో..

Half Day Schools

Half Day Schools: మార్చి నెల ప్రారంభమైంది. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మధ్యాహ్నం సమయంలో చిన్నారులు, వృద్ధులు సాధ్యమైనంత వరకు బయటకు రావద్దని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినా ఎండ వేడిమి నుంచి కాపాడుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక స్కూల్ విద్యార్థులు ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read: Amarnath Yatra 2025 : జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. ఎన్ని రోజులు, ఎప్పుడు ముగుస్తుంది, రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి..

ప్రతీయేటా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఎండల తీవ్రత నేపథ్యంలో ఈనెల 15వ తేదీ నుంచి అన్ని బడుల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ స్కూళ్లతోపాటు ప్రైవేటు, ఎయిడెడ్ ఇతర అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని బడులు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే నిర్వహించనున్నారు. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి.