Hyderabad : భార్యాభర్తల మధ్య ఘర్షణ.. 22 రోజుల పసికందు మృతి
భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న గొడవలో 22 రోజుల పసికందు మృతి చెందాడు. ఈ దారుణ ఘటన నగరంలోని సైదాబాద్ పూసల బస్తీలో చోటుచేసుకుంది.
- kunduru Vinod
- Published On : September 24, 2021 / 10:04 PM IST
Hyderabad (2)
Hyderabad : భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న గొడవలో 22 రోజుల పసికందు మృతి చెందాడు. ఈ దారుణ ఘటన నగరంలోని సైదాబాద్ పూసల బస్తీలో చోటుచేసుకుంది. రాజేష్, జాహ్నవి అనే దంపతులు గత కొంతకాలంగా పూసలబస్తీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. రాజేష్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఫ్యూటుగా మద్యం సేవించిన రాజేష్.. శుక్రవారం సాయంత్రం భార్యతో గొడవకు దిగాడు. భార్యపై దాడి చేస్తున్న సమయంలో 22 రోజుల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
Read More : CM Jagan కాలికి గాయం.. ఢిల్లీ పర్యటన రద్దు
దీంతో ఆ శిశువు ప్రాణాలు కోల్పోయాడు. శిశువు మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జాహ్నవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఏడాది క్రితం రాజేశ్ భార్యతో గొడవ పడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుడు పెద్ద కుమారుడిని సరిగా చూసుకోవడం లేదని పోలీసుల విచారణలో తేలడంతో.. ఆ అబ్బాయిని యూసుఫ్‌గూడ శిశువిహార్‌కు తరలించారు.
Read More : Crypto Trading : క్రిప్టోకరెన్సీ లావాదేవీలన్నీ అక్రమమేనన్న చైనా
