CM Jagan కాలికి గాయం.. ఢిల్లీ పర్యటన రద్దు
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దైంది. కాలు బెణకడంతో ఢిల్లీ టూర్ ను జగన్ రద్దు చేసుకున్నారు. సీఎం జగన్ బదులు హోంమంత్రి సుచరిత ఢిల్లీ వెళ్లనున్నారు.

Cm Jagan
CM Jagan : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దైంది. కాలు బెణకడంతో ఢిల్లీ టూర్ ను జగన్ రద్దు చేసుకున్నారు. సీఎం జగన్ బదులు హోంమంత్రి సుచరిత ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి మంత్రి సుచరిత హాజరవుతారు. ఎల్లుండి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో హోంశాఖ సమావేశం కానుంది. హోంశాఖ నిర్వహించే సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
Andhra Pradesh : వైద్యారోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
ఇవాళ ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో సీఎం జగన్ కాలు బెణికింది. ఇవాళ సాయంత్రానికి కూడా కాలు నొప్పి తగ్గకపోవడంతో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో జగన్ తన ఢిల్లీ పర్యటనను చివరి క్షణంలో రద్దు చేసుకున్నారు.
AP Secretariat : సచివాలయం ఉద్యోగులకు ఉచిత వసతి నిలిపివేత
షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం జగన్ ఢిల్లీ టూర్ కి వెళ్లాల్సి ఉంది. కేంద్ర హోంశాఖ నిర్వహించే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అలాగే పలు కేంద్ర మంత్రులను కూడా కలవాల్సి ఉంది. ఇంతలోనే కాలు నొప్పి కారణంగా పర్యటన రద్దైంది.