Crypto Trading : క్రిప్టోకరెన్సీ లావాదేవీలన్నీ అక్రమమేనన్న చైనా

క్రిప్టోకరెన్సీ లావాదేవీలన్నీ అక్రమమైనవేనని చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. బిట్​కాయిన్, ఎథీరియం మొదలైన డిజిటల్​ కరెన్సీల వల్ల దేశ ఆర్థిక రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని

Crypto Trading : క్రిప్టోకరెన్సీ లావాదేవీలన్నీ అక్రమమేనన్న చైనా

Pboc

Crypto Trading  క్రిప్టోకరెన్సీ లావాదేవీలన్నీ అక్రమమైనవేనని చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. బిట్​కాయిన్, ఎథీరియం మొదలైన డిజిటల్​ కరెన్సీల వల్ల దేశ ఆర్థిక రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. మనీ లాండరింగ్, ఇతర నేరాలకు క్రిప్టోకరెన్సీ ఉపయోగపడుతుందని చైనా సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. వర్చువల్ కరెన్సీతో లావాదేవీలు జరపొద్దని, అది నేరమని తమ వెబ్​సైట్​లో తెలిపింది.

క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ను సులభతరం చేయకుండా ఆర్థిక సంస్థలు,చెల్లింపు కంపెనీలు మరియు ఇంటర్నెట్ సంస్థలను నిషేధిస్తామని మరియు అలాంటి కార్యకలాపాల నుండి వచ్చే ప్రమాదాల పర్యవేక్షణను బలోపేతం చేయనున్నట్లు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా తెలిపింది. మరోవైపు, పీపుల్స్​ బ్యాంక్​ ఆఫ్​ చైనా.. ప్రస్తుతం క్యాష్​లెస్​ ట్రాన్సాక్షన్స్​ కోసం ప్రత్యేకంగా యువాన్​(చైనా కరెన్సీ) ఎలక్ట్రానిక్​ వర్షన్​ను సిద్ధం చేస్తోంది.

కాగా, క్రిప్టోకరెన్సీలపై చైనా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే, క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ మరియు మైనింగ్‌ని అరికట్టడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు బిట్‌కాయిన్ మరియు ఇతర మార్కెట్లలో తీవ్రమైన ప్రభావం చూపెడుతోంది. ఈ ఈ ఏడాది మేలో క్రిప్టోకరెన్సీ-మైనింగ్ కార్యకలాపాలను మూసివేస్తామని.. చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పింది. క్రిప్టోకరెన్సీ-మైనింగ్ కార్యకాలాల కోసం.. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుండి భారీ మొత్తంలో విద్యుత్తును వినియోగిస్తున్నారని.. అయితే దేశం కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి కట్టుబడి ఉందని చైనా తెలిపింది.

వాస్తవానికి,చైనా బ్యాంకుల్లో 2013లోనే క్రిప్టోకరెన్సీ వినియోగంపై నిషేధం విధించారు. అయితే ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ మైనింగ్​, ట్రేడింగ్ ఇప్పటికీ జరుగుతోందన్న అనుమానం నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.