SP Sunitha Reddy – Navadeep : హైదరాబాద్‌లోని మాదాపూర్ డ్రగ్స్ కేసు(Madhapur Drugs Case)లో టాలీవుడ్ హీరో నవదీప్‌ను విచారించామని యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతా రెడ్డి అన్నారు. డ్రగ్స్ కేసు విషయంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు టాలీవుడ్ హీరో నవదీప్ సమాధానాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
పోలీసులు దాదాపు ఆరు గంటల పాటు డ్రగ్స్ కేసులో నవదీప్‌ను విచారించారు. దీనిపై ఎస్పీ సునీతా రెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు. అడిగిన అన్ని ప్రశ్నలకు నవదీప్ సమాధానం చెప్పాడని అన్నారు. డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఉన్న 81 లింక్స్ ను గుర్తించామని వివరించారు. వాటిల్లో 41 లింక్స్ పై నవదీప్ వివరాలు ఇచ్చాడని తెలిపారు.
డ్రగ్స్ తీసుకున్నట్లు సిట్, ఈడీ విచారణలో నవదీప్ అంగీకరించాడని అన్నారు. తాను ఇప్పుడు మాత్రం డ్రగ్స్ వాడడం లేదని నవదీప్ అంటున్నాడని చెప్పారు. తన స్నేహితుడు రామ్‌చంద్‌తో కలిసి గతంలో పబ్ బీపీఎం నిర్వహించినట్టు నవదీప్ అంటున్నాడని వివరించారు. నవదీప్ తన ఫోన్ లోని డేటా మొత్తం డిలీట్ చేశాడని తెలిపారు. ఫోన్ రీట్రైవ్ చేసి మళ్లీ విచారిస్తామని అన్నారు.
Navadeep: రామచంద్ అనే వ్యక్తితో నాకు పరిచయం ఉన్నమాట వాస్తవమే: డ్రగ్స్ కేసుపై హీరో నవదీప్