ప్రియుడ్ని నమ్మి వెళ్లిన శ్రీవాణీిని.. గుట్టల్లో రేప్ చేసి చంపేశాడు
- Subhan Ali Shaik
- Published On : August 30, 2020 / 10:07 PM IST
వలిగొండకు చెందిన శ్రీవాణి మిస్సింగ్, మర్డర్ కేసును పోలీసులు చేధించారు. శనివారం వలిగొండ వలిభాష గుట్టల్లో శ్రీవాణి మృతదేహం దొరకడంతో వివరాలు కనిపెట్టేందుకు దారి దొరికింది. ఈ కేసులో మిరియాల రవిని, చిన్నపాక రవితేజలను నిందితులుగా పోలీసులు గుర్తించారు.
ఆగష్టు 18న తల్లితో పాటు వలిగొండకు శ్రీవాణి వెళ్లింది. అతని లవర్ మిరియాల రవిని పిలవడంతో వలిభాషగుట్ట దగ్గరకు శ్రీవాణి వెళ్లింది. ఆమెపై ముందుగానే పెంచుకున్న అనుమానంతో ఆమెను చంపాలని రవి నిర్ణయించుకున్నాడు. శ్రీవాణిని హత్య చేసేందుకు తన స్నేహితుడు రవితేజను సహాయం కోరాడు.
ఇవేమీ ఊహించకుండా వచ్చిన శ్రీవాణిపై వలిభాషగుట్టల్లో అత్యాచారం జరిపాడు. ఆ తర్వాత హత్య చేశాడు. అదే రోజు భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి శివారులో మిరియాల రవి అనుమానాస్పద మృతి చెందడం సంచలనం సృష్టించింది. .
రవి అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఆగష్టు 29న అనుమానంతో ఏ2 రవితేజను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా, రవితేజ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
