Municipal Elections : తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగేనా?

తెలంగాణలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు మున్సిపల్ ఎన్నికలపై ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది.

suspense over municipal elections : తెలంగాణలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు మున్సిపల్ ఎన్నికలపై ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది. కరోనా విజృంభిస్తుండడంతో… మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కష్టసాధ్యమని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తోంది. కరోనా సోకడంతో.. కొన్ని రోజుల నుంచీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి.. హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇంటినుంచే ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ తో పాటూ అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్‌, జడ్చర్ల కొత్తూరు మున్సిపాలిటీల ఎన్నికలకు నోటిఫికేషన్ ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. రేపటితో నామినేన్ల ఉపసంహరణ గడువు పూర్తికానుంది. ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హైకోర్టును ఆశ్రయించారు.

అయితే ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండడంతో… నిర్వహణ పై నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషన్‌కే వదిలేసింది హైకోర్టు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలా లేదా అనే నిర్ణయాధికారం ప్రభుత్వానికి ఉండడంతో…ఇప్పుడు అందరి దృష్టీ అటు వైపు పడింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఆధారపడి ఉంది.

మరోవైపు నైట్ కర్ఫ్యూ అమల్లోకి రావడంతో ఈసీ…అభ్యర్థుల ప్రచార సమయాన్ని కుదించింది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉన్న ప్రచార సమయాన్ని. రాత్రి 8 గంటల వరకే పరిమితం చేసింది. లౌడ్ స్పీకర్లను కేవలం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే వినియోగించాలని ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు