Nalgonda Dist
Teacher Theft Country Chicken : సర్కార్ ఇస్తున్న జీతం చాల్లేదో మరి.. దొంగతనంగా పట్టిన కోళ్లే టేస్టీగా అనిపించాయో కానీ.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోళ్లు పట్టడం మొదలెట్టాడు. ఇంటికూర కంటే పొరుగింటి కూరే రుచి అన్నట్లుగా.. ఆ టీచర్ వ్యవహరించడం హాట్ టాపిక్ అయ్యింది. కోళ్లు పడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మోత్కూరులో చోటు చేసుకుంది.
అసలు ఈ విషయం ఎలా బయటపడిందంటే..
కోళ్ల యజమాని కృష్ణారెడ్డికి చెందిన నాటుకోళ్లు గత కొంత కాలంగా మిస్సవుతున్నాయి. ఆ ఏరియాలో ఆయన ఒక్కడివే కాకుండా ఇరుగుపొరుగు వాళ్ల కోళ్లు కూడా ఉన్నట్టుండి మాయమయ్యేవి. దీంతో.. ఇంటి సమీపంలో ఉండే ప్రభుత్వ టీచర్ సునీల్‌పై అనుమానంతో నిఘా పెట్టారు కృష్ణారెడ్డి.
పేరుకి ఉపాధ్యాయుడు ఇతను. కానీ..ఇరుగు పొరుగు ఇళ్లలో కోళ్లు ఉన్నాయా ? లేదా అని కనిపెట్టేవారు. ఓనర్లు ఎవరూ లేని టైమ్‌లో వాటిని పట్టేయడాన్ని అలవాటుగా చేసుకున్నారు సునీల్. గింజలు వేస్తాడు..కోళ్లు రాగానే..అమాంతం వాటిని పట్టుకొనేవారు. ఎవరికి అనుమానం రాకుండా.. వాటిని అమ్మేయడమో.. కోసుకొని కూర వండుకోవడం చేసేవాడు సునీల్. రెండ్రోజుల క్రితం కూడా.. కృష్ణారెడ్డికి చెందిన కోడిని పట్టేశారు సునీల్. కోళ్ల అరుపులు విన్న వాటి యజమాని కృష్ణారెడ్డి బైక్‌పై వెళ్తూ పట్టుబడ్డారు.
దీంతో.. కోడిపుంజు, బైక్‌ను వదిలేసి పరారయ్యాడు సునీల్. సునీల్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు కోళ్ల యజమాని కృష్ణారెడ్డి. గతంలోనూ తన ఇంట్లో కోళ్లు మాయమయ్యాయని వాపోతున్నాడు. కృష్ణారెడ్డి ఫిర్యాదుతో.. ఉపాధ్యాయుడు సునీల్‌పై తగిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. ఫిర్యాదుపై ఫోన్ చేస్తే.. తనకు కరోనా వచ్చిందని చెబుతున్నాడని వెల్లడించారు.
Read More : Viral Wedding Card: వరుడు పేరు సోషలిజం.. వధువు మమతా బెనర్జీ!