Telangana assembly sessions
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 11.30 గంటలకు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మొదటిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు.
ఇప్పటికే గవర్నర్ ప్రసంగానికి తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలలో ఇరిగేషన్ శాఖ పై వైట్ పేపర్ విడుదల చేయనుంది ప్రభుత్వం. కాళేశ్వరంపై వేసిన విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్‌ను సభలో ప్రవేశ పెడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
మరోవైపు, నీటి ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో ఇరు పక్షాలు మాటల యుద్ధానికి దిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ సమీక్ష నిర్వహించారు.
ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన విషయంలో కొట్లాడదామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే తమ పార్టీ నేలకు చెప్పారు. కేంద్రం ఒత్తిడి తెచ్చినప్పటి తాము పదేళ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదని కేసీఆర్ అంటున్నారు.
కచ్చితంగా మీకు తగిన సమాధానం చెబుతాం- వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అద్దంకి దయాకర్ వార్నింగ్