కామారెడ్డిలో హై టెన్షన్.. పోలింగ్ కేంద్రం వద్ద రేవంత్ సోదరుడితో బీఆర్ఎస్ నేతల ఘర్షణ

సీఎం కేసీఆర్,టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నా కామారెడ్డిలో హై టెన్షన్ నెలకొంది. నువ్వా నేనా అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు..కాంగ్రెస్ నేతల మధ్య గొడవ చెలరేగింది.

High Tension Kamareddy : సీఎం కేసీఆర్,టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నా కామారెడ్డిలో హై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఈ నియోజక వర్గంపై అత్యంత ఆసక్తి నెలకొంది. దీనికి కారణం సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీకి దిగారు. కేసీఆర్ ను ఓడించాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో కేసీఆర్ గెలుపుతో పాటు రేవంత్ రెడ్డి గెలుపు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు కోసం ఇరుపార్టీలు పోటీ పడుతున్నాయి. దీంతో అక్కడ పోలింగ్ ప్రక్రియలో హైటెన్షన్ నెలకొంది. ఇటువంటి పరిస్థితిలో కామారెడ్డి అంటే కాకా రెడ్డిలా మాంచి వేడిమీదుంది. ఓటింగ్ పై ప్రభావం చూపేలా అక్కడి పరిస్థితులు నెలకొన్నట్లుగా కనిపిస్తోంది.

దీంట్లో భాగంగానే కామారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మధ్య గొడవ రేగింది. ఇదికాస్తా పెరిగి తోపులాటకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాలు పోటా పోటీగా రోడ్డుమీద బైఠాయించాయి. ఇప్పటికే కొడంగల్ లో ఓటు వేసిన రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కామారెడ్డికి రానున్నారు. దీంతో అక్కడ వాతావరణ వేడెక్కింది.

రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి పోలింగ్ బూత్ లలోకి వెళుతున్నారంటు బీఆర్ఎస్ నేతల ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ గొడవ చెలరేగింది. బీఆర్ఎస్ నేతల ఆరోపణల్ని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేశారు. తన వాహనాన్ని పోలీసులు అడ్డుకుని .. తన డ్రైవర్ ని కొట్టారంటున్న రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఆరోపించారు.

తనను రోడ్డుమీదనే దింపేసి.. నా వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లిపోయారని ఆరోపించారు. దీనిపై కొండల్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కామారెడ్డిలో గొడవ జరుగుతోందని తెలుసుకున్న రేవంత్ రెడ్డి హుటాహుటీన అక్కడకు బయలుదేరారు. దీంతో రేవంత్ రెడ్డి వస్తున్నారనే వార్తతో అక్కడి వాతావరణ మరింతగా వేడెక్కింది.

ట్రెండింగ్ వార్తలు