Vikas Raj : బోగస్ ఓట్లు తొలగించాలి, డబ్బు మద్యం కట్టడి చేయాలి, కేంద్ర బలగాలను దింపాలి- ఈసీతో రాజకీయ పార్టీలు

ఇప్పటికే డంప్ చేసిన అక్రమ డబ్బు, మద్యాన్ని పట్టుకోవాలి. బోగస్ ఓట్లపై ఈసీ చర్యలు చేపట్టాలి. Vikas Raj

EC CEO Vikas Raj (Photo : Google)

EC CEO Vikas Raj : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. నవంబర్ 30న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలతో ఈసీ వికాస్ రాజ్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. బోగస్ ఓట్లపై క్లారిటీ ఇవ్వాలని సీపీఎం అడిగింది. మునుగోడు ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న డబ్బు ఏం చేశారని నేతలు ప్రశ్నించారు. 5 రోజుల ముందే ఓటర్లకు ఓటర్ స్లిప్పులు ఇవ్వాలని సీపీఎం నేతలు కోరారు. లిక్కర్ బ్యాన్ చేయాలని ఆప్ పార్టీ డిమాండ్ చేసింది. బ్యాలెట్ ఓట్లు పెట్టాలని ప్రజాశాంతి పార్టీ కోరింది. ఓటు అప్లయ్ చేసుకోవడమే కాకుండా ఆధార్ తో డైరెక్ట్ గా ఓటర్ కార్డు ఇంటికి పంపాలంది.

సోమ భరత్, BRS
సోషల్ మీడియా వేదికగా ఎలక్షన్ కు సంబంధం లేని విమర్శలు చేయకూడదని ఈసీని కోరారు భరత్. సోషల్ మీడియాలో నిరాధారమైన వ్యక్తిగత విమర్శలు కట్టడి చేయాలన్నారు. సోషల్ మీడియా వేదికగా అన్ సోషల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ పోలింగ్ స్టేషన్ లో లైటింగ్ అరేంజ్ చేయాలని కోరారు. కర్ణాటక, ఛత్తీస్ గఢ్ నుంచి రాష్ట్రానికి భారీగా డబ్బులు వస్తున్నాయని, కట్టడి చేయాలని కోరారు. పార్టీల గుర్తును వృద్ధులు గుర్తు పట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read : కవితకు ఆ ఇద్దరి బాధ్యతలే ఎందుకు అప్పగించారు.. ఆ ఇద్దరు నేతలు ఎవరు?

అంథోని రెడ్డి, బీజేపీ
* షిఫ్టింగ్ ఓట్లపై ఈసీ క్లారిటీ ఇవ్వాలి.
* ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులను బదిలీ చేయాలి.
* డబ్బు, మద్యం కట్టడి చేయాలి.
* ఎన్నికల నిర్వహణ కోసం ఇతర రాష్ట్రాల అధికారులకు బాధ్యతలివ్వాలి.
* కేంద్ర బలగాలను దించాలి.

దయానంద్ రావు, బీఎస్పీ
* ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులపై ఫిర్యాదు చేశాము.
* ఇప్పటికే డంప్ చేసిన అక్రమ డబ్బు, మద్యాన్ని పట్టుకోవాలి.
* ఓల్డ్ సిటీలో బోగస్ ఓట్లపై ఈసీ చర్యలు చేపట్టాలి.
* ప్రభుత్వ అనుకూల అధికారులపై రెండు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ఈసీ ఆఫీసు ముందు ధర్నా చేస్తాం.

Also Read : కేసీఆర్ రాకతో షబ్బీర్ అలీ వెనకడుగు.. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?

నిరంజన్, కాంగ్రెస్
* ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నిబంధనలపై క్లారిటీ లేదు.
* రాజకీయ పార్టీ సభలు, సమావేశాలకు ఎవరు అనుమతి ఇవ్వాలో ఈసీ క్లారిటీ ఇవ్వాలి.

ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ నేత
* నాంపల్లి సెగ్మెంట్ లో బోగస్ ఓట్లపై ఈసీ చర్యలు తీసుకోవాలి.
* 40 వేల బోగస్ ఓట్లపై ఆధారాలతో వికాస్ రాజ్ కు ఇచ్చాను.
* బోగస్ ఓట్లను డిలీట్ చేస్తామని వికాస్ రాజ్ హామీ ఇచ్చారు.
* నాంపల్లిలో ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికలు జరిగేందుకు కేంద్ర బలగాలు కావాలని కోరాం.
* అధికారులపై పూర్తిస్తాయి నమ్మకం ఉంది. చర్యలు ఉంటాయని ఆశిస్తున్నా.

కాగా, ఈసీ సమావేశంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ ప్రతినిధుల మధ్య వాడీవేడి మాటలు నడిచాయి. ప్రగతి భవన్ లో బీ ఫామ్స్ ఇవ్వడంపై ఈసీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. ప్రగతి భవన్ లో బీ ఫామ్స్ ఇవ్వకూడదని, అది పబ్లిక్ ప్రాపర్టీ అని చెప్పింది. కాంగ్రెస్ ఫిర్యాదుతో విచారణకు అదేశించింది ఈసీ.

ట్రెండింగ్ వార్తలు