telangana assembly election 2023 today campaign and other live updates
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి జోరుగా ఉంది. ప్రధాన పార్టీల అగ్రనాయకులు, అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో సందడి వాతావరణం నెలకొంది.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం సభలో మంత్రి కేటీఆర్ కామెంట్స్
రెండోసారి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు పట్టుకొని ప్రమోషన్ ఇప్పిస్తా
రేవంత్ రెడ్డి మనుషులు బీఆర్ఎస్ పార్టీ ర్యాలీ చూసి నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలి
కేసీఆర్ రాష్ట్ర ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటారు
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కరెంటు పోయింది
సీఎం కేసీఆర్ ను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదు
జనంలో వుండే ఎమ్మెల్యే కావాలి కానీ జైలులో వుండే ఎమ్మెల్యే కాదు
రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తే తీసుకుని కారు గుర్తుకు ఓటు వేయండి
పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా జనసంద్రమైన కొడంగల్.#KCROnceAgain #VoteForCar@KTRBRS @PNReddyBRS @Drpmahendereddy pic.twitter.com/QUvHzUgof5
— BRS Party (@BRSparty) November 9, 2023
మంచిర్యాల జిల్లా జన్నారంలో బీజేపీ బహిరంగ సభలో బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
నేను చావుకి భయపడకు.. చావే నన్ను చూసి భయపడింది
తెలంగాణలో 80 శాతం ఉన్న హిందువులు ఏకమైతే రామరాజ్యం రావడం ఖాయం
ఖానాపూర్ లో రాథోడ్ రమేష్ గెలుపు ఖాయం
పటాన్‌చెరు అభ్యర్థి బీజేపీ నందీశ్వర్‌గౌడ్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు వెళుతూ బుల్‌డోజర్ ర్యాలీ చేపట్టారు.
రహదారిపై భారీగా ట్రాఫిక్ గా నిలిచిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు.
Each one chooses his own style: @BJP4India candidate for #Patancheru #NandishwarGoud took a #BulldozerRally while going to file his nomination papers @BJP4Telangana @ndtv @ndtvindia #BJPbulldozerRally pic.twitter.com/Nac52DjSDS
— Uma Sudhir (@umasudhir) November 9, 2023
సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి నామినేషన్
పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనతో సిరిసిల్ల ప్రజలు విసిగిపోయారు
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నిలబెట్టుకోలేదు
కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ అవినీతికి నిదర్శనంగా నిలిచింది: మహేందర్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ
పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు
మల్ రెడ్డి రంగారెడ్డి నామినేషన్ వేయడానికి వస్తుండగా ఘటన
లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు
ఘర్షణ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన రాచకొండ సీపీ చౌహాన్
ఇబ్రహీంపట్నంలో భారీ బందోబస్తు ఏర్పాటు
కేంద్ర ఎన్నికల సంఘానికి కెఏ పాల్ విజ్ఞప్తి
ప్రజాశాంతి పార్టీకి ఇంకా ఎన్నికల గుర్తును కేటాయించని ఈసీ
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన కెఏ పాల్
గుర్తు ఏంటో తెలీకుండా ఎలా ప్రచారం చేయాలి, ఎలా నామినేషన్ వెయ్యాలంటున్న కెఏ పాల్
ప్రభుత్వ విప్ గంప నివాసంలో సీఎం కేసీఆర్ సమావేశం
గ్రూప్ తగాదాలు వీడి కలిసి కట్టుగా పని చేయాలని ఆదేశం
ఇటీవల జరిగిన పార్టీ పరిణామాలపై నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ ప్రక్రియలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.#KCROnceAgain #VoteForCar pic.twitter.com/MflObGFpIh
— BRS Party (@BRSparty) November 9, 2023
ఖమ్మం జిల్లా: పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామినేషన్
పొంగులేటి వెంట తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు
సత్తుపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్య నామినేషన్
సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మట్టా రాగమయి
వరంగల్ తూర్పులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండా సురేఖ
పరకాల లో BRS అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా రేవూరి ప్రకాష్ రెడ్డి నామినేషన్లు
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నాయిని రాజేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా రావు పద్మా అమరేందర్ రెడ్డి నామినేషన్లు
వర్దన్నపేటలో BRS అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అరూరి రమేష్
స్టేషన్ ఘనపూర్ BRS అభ్యర్థిగా కడియం శ్రీహరి, బీజేపీ అభ్యర్థిగా విజయరామారావ్ నామినేషన్లు
పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా యశస్వినిరెడ్డి నామినేషన్ దాఖలు
నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ
నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ తరఫున రూరల్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాజిరెడ్డి గోవర్ధన్
బోధన్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి
సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో తల్లి లలితా వెంకటేశం యాదవ్ ఆశీర్వాదం తీసుకున్న మంత్రి తలసాని
వెస్ట్ మారేడుపల్లి జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్
సనత్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆశీర్వాదం మేరకు నామినేషన్ వేశాను
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొడుతుంది
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు: తలసాని
ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు భట్టి విక్రమార్క నామినేషన్
మధిర ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
మధిర ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు. pic.twitter.com/c6vTvjNpLt
— Telangana Congress (@INCTelangana) November 9, 2023
రేగా కాంతారావు నామినేషన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగా కాంతారావు నామినేషన్ దాఖలు
ఇల్లందు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హరిప్రియ నామినేషన్ వేశారు
నాలుగు జాబితాలో కలిపి 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కమలనాథులు
పొత్తులో భాగంగా జనసేనకు 8 స్థానాలను కేటాయించిన కమలనాథులు
ఇంకా 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని బీజేపీ
రేపు ఒక్క రోజే నామినేషన్ కు అవకాశం.. టికెట్ ఆశిస్తున్న నేతల్లో టెన్షన్
బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అసెంబ్లీ స్థానాలు
1. శేరిలింగంపల్లి
2. మల్కాజ్ గరి
3. మేడ్చల్
4. పెద్దపల్లి
5. సంగారెడ్డి
6. అలంపూర్
7. దేవరఖద్ర
8. నాంపల్లి
9. సికింద్రాబాద్ కంటోన్మెంట్
10. నర్సంపేట
11. మధిర
నల్గొండ జిల్లా మిర్యాలగూడ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన బత్తుల లక్ష్మారెడ్డి
ఇంకా టికెట్ ప్రకటించకుండా మిర్యాలగూడ స్థానాన్ని పెండింగ్ లో ఉంచిన కాంగ్రెస్ అధిష్టానం
బీఆర్ఎస్ అభ్యర్థిగా నల్లమోతు నామినేషన్
నామినేషన్ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు నివాళి
పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా వెళ్లి ఆర్వో కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
ఖమ్మం: ఐటీ దాడులపై ఈసీకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు
ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నానని తెలిసి కుట్ర చేశారు
బీఆర్ఎస్, బీజేపీ ఫెవికాల్ బంధం దీనితో బయట పడింది
ముందుగానే తెలుసు, కానీ నామినేషన్ అడ్డుకోవాలనుకోడం దుర్మార్గం
బీఆర్ఎస్, బీజేపీలో ఓటమి భయం కనిపిస్తోంది: పొంగులేటి
సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకే వస్తుందన్న నమ్మకం తోటే నామినేషన్ దాఖలు చేశా
కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై పూర్తి నమ్మకం ఉంది
సూర్యాపేటతో పాటు తుంగతుర్తి, పాలేరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తా
అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటా: రాంరెడ్డి దామోదర్ రెడ్డి
మంత్రి జగదీష్ రెడ్డి నామినేషన్
సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి నామినేషన్ సందర్భంగా జిల్లా కేంద్రంలో గులాబీ శ్రేణుల భారీ ర్యాలీ
ఎస్వీ డిగ్రీ కళాశాల నుంచి పాదయాత్రగా వెళ్లి నామినేషన్ వేసిన జగదీష్ రెడ్డి
సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానానికి కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్
ఆస్పత్రి నుంచి అంబులెన్స్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రాక
ఐఓసి కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గరీమ అగర్వాల్ కు నామినేషన్ సమర్పణ
హనుమకొండ జిల్లా పరకాలలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత
బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి ఒకేసారి రావడంతో రెండు పార్టీల కార్యకర్తల పోటాపోటీ నినాదాలు
ఇరు వర్గాలను అదుపు చేసిన పోలీసులు
హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి నామినేషన్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మధు యాష్కీ గౌడ్ నామినేషన్
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న మంత్రి కేటీఆర్
సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్
నామినేషన్ వేసిన తర్వాత కేటీఆర్ మీడియా సమావేశం
సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRBRS #KCROnceAgain#VoteForCar pic.twitter.com/KEhqufeNIG
— BRS Party (@BRSparty) November 9, 2023
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
ఒకేసారి నామినేషన్ వేసేందుకు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్, కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి
బాల్క సుమన్ వాహనాన్ని కార్యాలయం లోపలి వరకు అనుమతించడంతో కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం
ఇరు పార్టీల కార్యకర్తలు నేతల మధ్య తోపులాట, పోలీసుల రంగ ప్రవేశం
ఇరువర్గాలు శాంతింపజేస్తున్న పోలీసులు
కరీంనగర్ జిల్లా: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న ఈటల రాజేందర్
హెలికాప్టర్ లో హుజురాబాద్ కి చేరుకున్న ఈటల రాజేందర్. ఘనస్వాగతం పలికిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు
గజ్వేల్ లో సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన కామారెడ్డికి బయలుదేరారు. నామినేషన్ వేసిన అనంతరం ఐఓసీ సెంటర్ బయట వేచి ఉన్న కార్యకర్తలకు సీఎం కేసీఆర్ అభివాదం చేశారు.
గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ నామినేషన్ కార్యక్రమం #KCROnceAgain #VoteForCar https://t.co/n0SqosExu4
— BRS Party (@BRSparty) November 9, 2023