Telangana Banks
Telangana Banks: లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకుల టైమింగ్ మారనుంది. ఇవాళ(01 జూన్ 2021) నుంచి బ్యాంకు పనివేళల్లో మార్పులు చేస్తూ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో మరో పది రోజుల పాటు ప్రభుత్వం లాక్‌డౌన్ పొడగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా.. లాక్‌డౌన్ నిబంధనలు మేరకు.. బ్యాంకుల పనివేళలల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి బ్యాంకులు పనివేళలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అందుబాటులో ఉండగా లేటెస్ట్‌గా టైమింగ్‌లో మార్పులు చేశాయి బ్యాంకులు.
సడలింపులు తర్వాత 10గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పని చేసేలా నిర్ణయం తీసుకున్నట్లుగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రకటన చేసింది. మారిన బ్యాంకు వేళలు మంగళవారం నుంచి 9వ తేదీ వరకు అమల్లో ఉంటాయని తెలిపింది.