Madhavi Murder Case: శరీర భాగాలను కుక్కర్లో ఉడికించిన మీర్‌పేట్ మాధవి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..
Madhavi Murder Case: మీర్‌పేట మాధవి హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలు
Meerpet Madhavi case
Madhavi Murder Case: మీర్‌పేట మాధవి హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో వెంకట మాధవి (35) అనే మహిళ కనిపించడం లేదని ఆమె తల్లి మీర్పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా.. భర్త, మాజీ ఆర్మీ జవాన్ గురుమూర్తి భార్యను హత్య చేసినట్లు గుర్తించారు. మాధవి శరీర భాగాలను ముక్కలు ముక్కలు చేసిన గురుమూర్తి.. శరీర భాగాలను పలు ప్రాంతాల్లో పడేశాడు. అయితే, తాజాగా ఈ కేసుకు సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : Tiruvallur : ఛీ ఛీ.. ఏం కొడుకుల్రా మీరు.. బీమా సొమ్ముకోసం ఇంత దారుణమా.. పామును తీసుకొచ్చి..
మీర్పేట్ మాధవి హత్య కేసు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. భర్త గురుమూర్తే మాధవిని హత్యచేసినట్లు పోలీసులు సైంటిఫిక్ ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. ఈ క్రమంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మరదలితో గురుమూర్తి వివాహేతర సంబంధ వ్యవహారమే ఈ హత్యకు కారణమని నిర్ధారణ అయింది.
మీర్పేట్ మాధవి హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 36మంది సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచారు. రంగారెడ్డి కోర్టులో రోజువారి ట్రైల్ కొనసాగుతుంది. 20మంది సాక్ష్యుల విచారణ పూర్తయింది. ట్రైల్ సందర్భంగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. గురుమూర్తికి మరదలుతో వివాహేతర సంబంధం ఉందని, దాని కారణంగానే తరచూ గురుమూర్తి – మాధవి మధ్య గొడవలు జరిగేవని, ఇదే విషయంపై పలుమార్లు పంచాయతీ చేసినా గురుమూర్తి తీరు మారలేదని, మళ్లీ అదే విషయంపై గొడవ పడటంతో మాధవిని గురుమూర్తి హత్య చేసినట్లు తేలిసింది.
గురుమూర్తి భార్యను హత్యచేసి.. ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలు చేశాడు. పలు శరీర భాగాలను కుక్కర్లో ఉడికించిన గురుమూర్తి.. ఎముకలు గ్రైండ్ చేసి ఆ పొడిని చెరవులో పడేవేశాడు. పోలీసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలను కోర్టు ముందు ఉంచారు.
