Tiruvallur : ఛీ ఛీ.. ఏం కొడుకుల్రా మీరు.. బీమా సొమ్ముకోసం ఇంత దారుణమా.. పామును తీసుకొచ్చి..
Tiruvallur : తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పోతాతూర్‌పేటై గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కొడుకులు సొంత తండ్రిపైనే పాముతో కాటు
Tiruvallur : తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పోతాతూర్‌పేటై గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కొడుకులు సొంత తండ్రిపైనే పాముతో కాటు వేయించి హత్య చేశారు. ఆ తరువాత సాధారణ మరణంగా చిత్రీకరించారు. అయితే, రూ.3కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నంలో ఇద్దరు కొడుకుల బండారం బయటపడింది. దీంతో పోలీసులు రంగంలోకిదిగి తమదైన శైలిలో అసలు విషయాన్ని రాబట్టారు.
పొతతూరుపెట్టై గ్రామానికి చెందిన ఈపీ గణేశణ్ (56) ఓ ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు మోహన్ రాజ్, హరిహరన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గణేశరణ్ పేరుపై రూ.3కోట్ల ఇన్సూరెన్స్ ఉంది. ఈ సొమ్ముకోసం ఇద్దరు కొడుకులు తండ్రి హత్య చేయించారు.
ఈ ఏడాది అక్టోబర్ నెలలో తమ తండ్రిని చంపాలని ఇద్దరు కుమారులు ప్లాన్ వేశారు. ఇందుకు ఓ పాములు పట్టేవాడిని సంప్రదించి నాగుపామును తీసుకొచ్చారు. తండ్రి కాలికి పాముతో కాటు వేయించారు. అయితే, స్థానికులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో.. సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మరుసటి రోజే అత్యంత విషపూరితమైన క్రైట్ పామును కుమారులు ఇంటికి తీసుకొచ్చారు. తన పొడుకొని ఉండగా మెడపై కాటు వేయించారు. క్షణాల్లో గణేశరణ్ ప్రాణాలు కోల్పోయారు.
తమ తండ్రి గణేశరణ్ పాముకాటుతో మరణించినట్లు అందరినీ నమ్మించారు. పాముకాటుకు గురై తన తండ్రి ఇంట్లో చనిపోయాడని అక్టోబర్ 22వ తేదీన పోలీస్ స్టేషన్ మోహన్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేశారు.
తండ్రి గణేశరణ్ మరణం తరువాత అతని పేరుపై ఉన్న రూ.3కోట్ల ఇన్సూరెన్స్ కోసం అప్లయ్ చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించి తమ తండ్రి మరణానికి సంబంధించిన వివరాలను అందించారు. అయితే, ఇన్సూరెన్స్ కంపెనీ వారికి గణేశణ్ కుమారుల మీద ఏదో అనుమానం కలిగింది. వారి ప్రవర్తన తీరులో అనుమానం కలగడంతో ఇన్సూరెన్స్ కంపెనీ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకొని ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించారు. ఈ విచారణలో గణేశణ్ ను కుమారులే చంపారని తేలింది. దీంతో ఇద్దరు కొడుకులతోపాటు.. వారికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
