Live in Relationships : సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు.. అలా అయితే తప్పు.. కానీ.. 12మంది మహిళలకు బిగ్ రిలీఫ్..

Live in Relationships : సహజీవనం (లివ్ ఇన్ రిలేషన్‌షిప్)పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వివాహం కాని మేజర్లు కలిసి జీవిస్తే

Live in Relationships : సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు.. అలా అయితే తప్పు.. కానీ.. 12మంది మహిళలకు బిగ్ రిలీఫ్..

Live-in relationships

Updated On : December 20, 2025 / 9:50 AM IST

Live in Relationships : సహజీవనం (లివ్ ఇన్ రిలేషన్‌షిప్)పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వివాహం కాని మేజర్లు కలిసి జీవిస్తే అది చట్ట వ్యతిరేకం కాదు.. కానీ, విడాకులు తీసుకోకుండా వివాహితులు అదేపని చేస్తే నేరంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో సహజీవనం చేస్తున్న 12మంది అవివాహిత మహిళలకు రక్షణ కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

Also Read : Hyderabad : ఖాళీ ప్లాట్‌లో ఏకాంతంగా కలిసిన ప్రేమికులు.. యువతి తండ్రి రావడంతో..

సహజీవనం చేస్తున్న తమను కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారంటూ.. తమకు రక్షణ కల్పించాలని 12మంది మహిళలు విడివిడిగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమకు రక్షణ కల్పించాలంటూ మరో జంట పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ ధర్మాసనం విచారణ జరిపి వేరువేరు తీర్పులిచ్చారు. తీర్పు సమయంలో వివేక్ కుమార్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పౌరుడు మైనర్ లేదా మేజర్, వివాహిత లేదా అవివివాహిత అనే తేడా లేకుండా భారత రాజ్యాంగంలోని పౌరులుగా ప్రాథమిక జీవించే హక్కును ఉన్నతమైందిగా పరిగణించాలని జస్టిస్ సింగ్ పేర్కొన్నారు. సహజీవనం విధానం అందరికీ నచ్చనంత మాత్రాన ఈ విధానాన్ని చట్టవ్యతిరేకమైనదిగా భావించలేమని తెలిపారు. సహజీవనం సమాజం ఆమోదించకపోగా.. నేరంగా పరిగణిస్తుందన్న విషయాన్ని న్యాయమూర్తి అంగీకరించారు.

పాశ్చాత్య భావాలను స్వాగతించడానికి భారతదేశం ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటుంది. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ కూడా అలాంటి భావజాలమే. ఇది కొందరికి అనైతికత ప్రవర్తన.. మరికొందరికి మాత్రం అనుకూల జీవనానికి అమోదయోగ్యమైన మార్గం అని జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ వ్యాఖ్యానించారు.

మరో కేసులో ఇదే న్యాయమూర్తి తీర్పు చెబుతూ.. విడాకులు తీసుకోకుండా వివాహితులు సహజీవనం చేస్తే అది చట్ట వ్యతిరేకమవుతుందని తెలిపారు. తమకు పోలీసు రక్షణ కల్పించాలంటూ సహజీవనం చేస్తున్న ఓ జంట చేసిన వినతిని తిరస్కరించారు. ఈ జంటలో పురుషునుకి ఇది వరకే పెండ్లి జరిగింది. భార్య కూడా ఉంది. తాము మేజర్లమైనందున సహజీవనం చేస్తున్నామని, రక్షణ కల్పించాలని కోరారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. వ్యక్తిగత స్వేచ్ఛ సంపూర్ణమైనదేమీ కాదు. భార్యకు ఉన్న చట్టబద్ద హక్కులను తీసివేయలేరని స్పష్టం చేశారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా సహజీవనం చేయడం కుదరదని, అలాంటి పరిస్థితుల్లో పోలీసు రక్షణ కల్పించలేమని తెలిపారు.