Nitin Gadkari : గడ్కరీ వ్యాఖ్యలపై కమలనాథులు గుస్సా

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకోవటం ఆ పార్టీ నేతలకు కోపం తెప్పించింది.

Nitin Gadkari : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకోవటం ఆ పార్టీ నేతలకు కోపం తెప్పించింది. నిన్న పలు అభివృధ్ధి, శంకు స్ధాపనల కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చిన గడ్కరీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మెచ్చుకున్నారు.  తాను అధికారంలో ఉండగా కాళేశ్వరం కు అనుమతులు ఇచ్చానని…. కాళేశ్వరం పూర్తవటం వల్లే హైదరాబాద్ ప్రజల దాహార్తి తీరిందని గడ్కరీ వ్యాఖ్యానించారు.

ఈ మాటలు ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో హాటా టాపిక్ గా మారి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఈ  వ్యాఖ్యలపై కమలనాథులు ఫైర్ అవుతున్నారు. ప్రాజెక్టు అనుమతులు ఇచ్చామని చెప్పటం వరకు బాగానే ఉన్నా…. రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకోవటం వారు జీర్ణించుకోలేక పోతున్నారు.  పార్టీలో ఏ ఇద్దరు నేతలు కలిసినా గడ్కరీ వ్యాఖ్యలగురించే చర్చించుకుంటున్నారు.

కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఒకవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  మండుటెండలో పాదయాత్ర చేస్తుంటే… కేంద్ర మంత్రులు ఇలా మాట్లాడటం ఏంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలోనూ ఇదే చర్చ జరుగుతోందని సమాచారం. గడ్కరీ  స్పీచ్ ఎవరు తయారు చేశారు…. ఎవరి ప్రోద్బలంతో తయారు చేశారని ఆరా తీస్తున్నారు.

Also Read : Tirumala : మే 5 నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అనుమతి-టీటీడీ

ట్రెండింగ్ వార్తలు