Telangana Budget 2026-27 : బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు కేటాయింపులు ఇలా.. భారీగా నిధులు.. సామాన్యుడికి వరాల జల్లు..
Telangana Budget 2026-27 : తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించారు.
- Harishth Thanniru
- Published On : March 20, 2026 / 01:46 PM IST
Telangana Budget 2026-27
Telangana Budget 2026-27 : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026-27ను అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం రూ.3,24,234 కోట్లుగా తెలిపారు. రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లుకాగా.. మూలధనం వ్యయం రూ.47,267కోట్లుగా పేర్కొన్నారు. అయితే, ఈ బడ్జెట్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది.
Also Read : Telangana Govt : తెలంగాణలో జూన్ 2 నుంచి కొత్త పథకం.. కుటుంబానికి రూ.5లక్షలు.. ఈ పథకం వల్ల ఉపయోగాలు ఇవే..
బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు కేటాయిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందులో రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మీ (ఉచిత బస్సు ప్రయాణం), గృహజ్యోతి, సన్న వడ్లకు కేటాయింపులు చేసినట్లు భట్టి తెలిపారు.
కేటాయింపులు ఇలా..
♦ ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు
♦ రైతు భరోసా – రూ.18,000 కోట్లు
♦ చేయూత – రూ.14,861 కోట్లు
♦ ఇందిరమ్మ ఇండ్లు – రూ.5,500 కోట్లు
♦ మహాలక్ష్మి పథకం – రూ.4,305 కోట్లు
♦ సన్న వడ్ల బోనస్ – రూ.3,500 కోట్లు
♦ గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్) – రూ.2,080 కోట్లు
♦ రాజీవ్ ఆరోగ్య శ్రీ – రూ.1,143 కోట్లు
♦ మహాలక్ష్మి పథకం కింద ఎల్‌పీజీ సబ్సిడీ – రూ.723 కోట్లు
♦ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా – రూ.600 కోట్లు
♦ పవర్ సబ్సిడీ – రూ.14,000 కోట్లు
♦ బియ్యం సబ్సిడీ – రూ.3,000 కోట్లు
♦ కల్యాణలక్ష్మి / షాది ముబారక్ – రూ.3,683
