Telangana Govt : తెలంగాణలో జూన్ 2 నుంచి కొత్త పథకం.. కుటుంబానికి రూ.5లక్షలు.. ఈ పథకం వల్ల ఉపయోగాలు ఇవే..
Telangana Govt : ఈ బడ్జెట్లో భట్టి విక్రమార్క పలు కొత్త పథకాలను ప్రకటించారు. వాటిలో ఒకటి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం.
Telangana Budget 2026-27
Telangana Govt : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026-27ను అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం రూ.3,24,234 కోట్లుగా తెలిపారు. రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లుకాగా.. మూలధనం వ్యయం రూ.47,267కోట్లుగా పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో భట్టి విక్రమార్క పలు కొత్త పథకాలను ప్రకటించారు. వాటిలో ఒకటి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దురమైతే.. ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒటైతే.. వాళ్లు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి అని భట్టి పేర్కొన్నారు. ఒక్క సంఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడుతుందని, ఆ భయం, ఆ అభద్రతాభావం ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉండకూడదన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం అని భట్టి విక్రమార్క చెప్పారు. ఇందులో భాగంగా ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను అమలు చేయబతున్నట్లు చెప్పారు.
సామాజిక అంతరాలతో సంబందం లేకుండా.. పేద, మధ్య తరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని 1కోటి 15లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా వచ్చే జూన్ 2వ తేదీ నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నూతనంగా ప్రవేశపెట్టబోతున్నట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
