KCR Public Meetings : కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ ఏపీ, కర్ణాటక, ఢిల్లీ.. భారీ బహిరంగ సభలకు ప్లాన్..!

నాందేడ్ సభ విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్ ఉత్సాహంగా ఉన్నారు. నాందేడ్ సభకన్నా మిన్నగా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా, ఢిల్లీలో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నేషనల్ లెవెల్ లో బీఆర్ఎస్ పార్టీని భారీగా విస్తరించేందుకు కేసీఆర్ తనదైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.

KCR Public Meetings : దేశ రాజకీయాలపై ఫోకస్ పెంచారు తెలంగాణ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ విస్తరణకు ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలకు కేసీఆర్ ప్లాన్ చేశారు. మహారాష్ట్ర నాందేడ్ సభ విజయవంతం కావడంతో ఏపీ, కర్నాటక, ఒడిశా, ఢిల్లీలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సభ నిర్వహించాలని యోచిస్తున్నారా? అంటే అవునంటున్నారు ఆ పార్టీ నేతలు.

నాందేడ్ సభ విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్ ఉత్సాహంగా ఉన్నారు. నాందేడ్ సభకన్నా మిన్నగా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా, ఢిల్లీలో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నేషనల్ లెవెల్ లో బీఆర్ఎస్ పార్టీని భారీగా విస్తరించేందుకు కేసీఆర్ తనదైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.

Also Read..Central Minister Kishan Reddy: భయంకరమైన నిజాలు అంటూ.. కేసీఆర్ పాలనపై ఆసక్తికర ట్వీట్ చేసిన కిషన్ రెడ్డి

జాతీయ స్థాయిలో వ్యవసాయం, జల విద్యుత్, ఆర్థిక, విద్య, వైద్యం, ఉద్యోగాల కల్పన, సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ తదితర ప్రధాన రంగాలకు సంబంధించిన విధానాలపై సీఎం కసరత్తు చేస్తున్నారు. ఈ రూపకల్పనకు సంబంధించి ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు, రిటైర్డ్ అధికారులతో త్వరలో ఢిల్లీలో వరుస సమావేశాలు జరిపేందుకు కేసీఆర్ సమాయత్తం అవుతున్నారని గులాబీ పార్టీ వర్గాలంటున్నాయి.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని ముందుగా నిర్ణయించారు. టీచర్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది ప్రభుత్వం. దీంతో జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read..MP Komatireddy Venkat Reddy: తెలంగాణలో హంగ్ ఖాయం.. కేసీఆర్ కాంగ్రెస్‌ను పొగడటం పొలిటికల్ డ్రామా

నాందేడ్ సభకన్నా గొప్పగా ఏపీ, కర్నాటక, ఒడిశాలతో పాటు ఢిల్లీలో పబ్లిక్ మీటింగ్ లకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కర్నాటకలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సభకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసి భారీ ఎత్తున జన సమీకరణ చెయ్యాలని యోచిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలోని గుల్బర్గా లేదా బెంగళూరు పరిసర ప్రాంతాల్లో సభ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపై గులాబీ శ్రేణులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఇక ఏపీలో విజయవాడ లేదా విశాఖపట్నంలో ఒక పబ్లిక్ మీటింగ్.. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో బహిరంగ సభ నిర్వహించాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ప్రతిపాదించారు. ఒడిశాలో రాష్ట్ర కార్యాలయం ప్రారంభించి అదే రోజున బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు గమాంగ్.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు భువనేశ్వర్ లో మకాం వేసి పార్టీ కార్యాలయం, భవన ఎంపిక, బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. అలాగే కోస్తా, ఉత్తరాంధ్రలో విడివిడిగా బహిరంగ సభలు నిర్వహించే అంశంపై బీఆర్ఎస్ వర్గాలు చర్చోప చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేయనున్నారు బీఆర్ఎస్ నేతలు. తద్వారా నార్త్, సౌత్ ఇండియాలో గులాబీ పార్టీ తన అజెండాను ప్రజల ముందు ఉంచనుంది.