CM Revanth Reddy : అసెంబ్లీ, లోక్‌సభ సీట్లపై యూటర్న్..! డీలిమిటేషన్ విషయంలో రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారా.?
CM Revanth Reddy : అసెంబ్లీ, లోక్‌సభ సీట్లపై యూటర్న్..! డీలిమిటేషన్ విషయంలో రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారా.? తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 182కు, పార్లమెంట్ స్థానాలు 26కు పెరగబోతున్నాయని జోస్యం చెప్పిన చర్చకు దారితీశారు.
- Harish Thanniru
- Updated on- July 12, 2026 / 09:26 AM IST
Telangana CM revanth reddy delimitation comments
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేటెస్ట్ కామెంట్స్ పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతున్నాయి. మధిరలో జరిగిన రైతు ఆశీర్వాదసభలో డీలిమిటేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. కేంద్రం చేపట్టిన డీలిమిటేషన్ పద్దతితో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆ మధ్య.. అందరి కంటే ముందే రచ్చకెక్కారు రేవంత్. హైబ్రిడ్ మోడల్లో సీట్లు పెంచాలని..లేకపోతే డీలిమిటేషన్‌ను అడ్డుకొని తీరుతామని పెద్ద ఇష్యూ చేశారు. కట్ చేస్తే డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ సెషన్లో కేంద్రం మళ్లీ డీలిమిటేషన్ బిల్లు తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీట్ల పెంపు అంశాన్ని ఈసారి కేంద్రం ఎలా డీల్ చేయబోతోందన్న డిస్కసన్ జరుగుతున్న టైమ్లో..స్వయంగా సీఎం రేవంత్ ఇచ్చిన స్టేట్మెంట్ బిగ్ డిబేట్ పాయింట్‌గా మారింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 182కు, పార్లమెంట్ స్థానాలు 26కు పెరగబోతున్నాయని జోస్యం చెప్పిన చర్చకు దారితీశారు. అంటే కేంద్రం చెప్పిన విధానంలోనే సీట్లు పెరుగుతాయని చెప్పకనే చెప్పినట్లు అయింది. డీలిమిటేషన్ విషయంలో సీఎం స్టాండ్ మారిందా.? అప్పుడు అలా మాట్లాడిన రేవంత్..ఇప్పుడు ఎందుకిలా యూటర్న్ తీసుకుంటున్నట్లు అనేది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
జూలై 20 నుంచి పార్లమెంట్ సెషన్ ప్రారంభం కానుంది. మరోసారి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు పెట్టి ఎలాగైనా ఈసారి పాస్ చేసేయాలనే పట్టుదలతో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, బిల్లు పాత విధానంలో ఉంటే కచ్చితంగా అడ్డుకుంటామని కాంగ్రెస్ తెగేసి చెబుతోంది. కానీ సీఎం రేవంత్ మాత్రం డీలిమిటేషన్ బిల్లు పాస్ కానుందనే ఇండికేషన్ ఇచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు.. పార్లమెంట్ సీట్లు 17 నుంచి 26కు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. అయితే సీట్ల పెంపు జరుగుతుందని చెప్పడానికి రీజనేంటో కూడా రేవంత్ రెడ్డి చెప్పారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మమతాబెనర్జీ పార్టీ టీఎంసీ రెండుగా చీలిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పార్లమెంట్‌లో రెండుగా చీలిపోయింది. ఈ రెండింటితోపాటు ఇతర రాజకీయ పార్టీలు చీలడం వెనుక బీజేపీ హస్తం ఉందనేది రేవంత్ రెడ్డి ఆరోపణ. పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లును నెగ్గించుకోవడం కోసమే బీజేపీ పొలిటికల్ పార్టీలను చీల్చుతుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. అటు టీఎంసీ, ఇటు ఆప్ రెండు పార్టీలు చీలడంతో.. పార్లమెంట్ డీలిమిటేషన్ బిల్లు పాస్ అవడం పక్కా అన్నట్లుగా కాంగ్రెస్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి బహిరంగ ప్రకటన చేయడంపై రకరకాల చర్చ జరుగుతోంది.
బిల్లుతో నష్టం జరుగుతుందని ఒకప్పుడు గట్టిగా వాదించి.. ఎట్టి పరిస్థితిల్లో ఆమోదం తెలపకుండా చూస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నారనేది రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతోంది. డీలిమిటేషన్ విషయంలో రేవంత్ యూటర్న్ తీసుకున్నారా.? ఆయనపై బీజేపీ ఒత్తిళ్లు ఉన్నాయా.? లేక ఏం చేసినా బిల్లును అడ్డుకోలేమని ఫిక్స్ అయిపోయి చేతులు ఎత్తేశారా.? అనేది ఆసక్తికరంగా మారింది.
రేవంత్ స్టేట్మెంట్‌తో మరోసారి డీలిమిటేషన్ ఎపిసోడ్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ పార్లమెంట్ సెషన్లో కేంద్రం డీలిమిటేషన్ బిల్లును తీసుకొస్తుందా.. లేదా.? తెస్తే ఏ పద్ధతిలో తెస్తుందని.. అది ఎలా ఆమోదం పొందుతుందనేది కూడా పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. అయితే బీజేపీ నేతలే ఎవరూ బిల్లు పాస్ అయిపోతుందని ధీమాగా ఇప్పటివరకు చెప్పని పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం డీలిమిటేషన్ అయిపోయినట్లే అనే ఇండికేషన్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎపిసోడ్ ఎటువైపు టర్న్ తీసుకుంటుందో.? సీట్ల పెంపు విషయంలో రేవంత్ రెడ్డి జోస్యం నిజమవుతుందో లేదో చూడాలి మరి.
