Revanth Reddy: మేడారంలో తెలంగాణ సీఎం.. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, ప్రత్యేక పూజలు.. రేవంత్ కు రాఖీ కట్టిన సీతక్క
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ములుగు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారంలో పర్యటించారు.
- V Santhosh Kumar
- Published on- August 16, 2026 / 03:49 PM IST
Telangana CM Revanth Reddy visited Medaram.
- మేడారంలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు
- అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పణ
- ములుగులో నూతన కలెక్టరేట్ ప్రారంభం
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన వనదేవతలు సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం రాకతో ఆలయ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొనగా, స్థానిక నాయకులు, అధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ప్రసిద్ధ గిరిజన క్షేత్రమైన మేడారంలో సీఎం (Revanth Reddy)పర్యటన తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది.
Gangajal Kawad Yatra: భాగ్యనగరంలో ఘనంగా ‘కావడి యాత్ర’.. కాషాయ వస్త్రాల్లో శివభక్తుల కోలాహలం
అమ్మవార్లకు సీఎం నిలువెత్తు బెల్లం, ప్రత్యేక కార్యక్రమాలు:
ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అమ్మవార్లకు 68 కిలోల నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఒక మొక్కను కూడా నాటారు. అనంతరం వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల సన్నిధిలో మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. అయితే, ఈ పర్యటనలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేకపోవడం గమనార్హం. కాగా, సీఎంను కలిసిన ఆలయ పూజారులు వినతిపత్రం అందజేయగా, వారి సమస్యలను పరిష్కరించాలని ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సూచించారు సీఎం.
ములుగు, పరకాల వైపు సీఎం పయనం:
మేడారంలో పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ములుగు బయలుదేరారు. ములుగులో పంచాయతీరాజ్ శాఖ పైలాన్ ఆవిష్కరణతో పాటు నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పరకాల పర్యటనకు వెళ్లి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
