Manikrao Thackare
Manikrao Thackare : ఉద్యోగ కల్పనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏఐసీసీ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే విమర్శించారు. నిరుద్యోగుల ఆశలను సీఎం కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో యువత చాలా నిరుత్సాహంతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రియాంకా గాంధీ సభ ద్వారా ఉద్యోగ కల్పనలో జరిగిన అన్యాయంపై మాట్లాడుతారని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వేస్తే ఉద్యోగ కల్పనలో ఏం చేయబోతున్నామన్న విషయం చెబుతారని పేర్కొన్నారు.
సభలో ప్రియాంక గాంధీ నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. యువత కాంగ్రెస్ పై నమ్మకంతో ఉన్నారని వెల్లడించారు. అన్ని వర్గాల నిరుద్యోగ యువత ప్రియాంకా గాంధీ సభకు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ యువత ఆకాక్షల మేరకు కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చిందన్నారు. కానీ, 9 ఏళ్లలో యువత ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ హయంలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని చెప్పారు. కేసీఆర్ 9 సంవత్సరాలు ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగ కల్పన జరుగలేదన్నారు.