Telangana Congress : జానారెడ్డికి కోపం వచ్చింది ? ఎందుకు ?

ప్రాధాన్యత లేని కమిటీకి తనను చైర్మన్‌గా చేశారంటూ జానారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇదే విషయమై ఏఐసీసీ సెక్రటరీ జనరల్స్‌ను, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్కం...

T..congress

Jana Reddy Is Angry : కాంగ్రెస్ సీనియర్‌ నేత జానారెడ్డికి కోపం వచ్చింది. నిన్న ఏఐసీసీ (AICC) వేసిన కమిటీ విషయంలో జానారెడ్డి గుర్రుగా ఉన్నారు. పార్టీలో జాయినింగ్స్‌ కోసం ఏఐసీసీ కమిటీ వేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీకి జానారెడ్డిని చైర్మన్‌గా నియమించింది. అయితే ప్రాధాన్యత లేని కమిటీకి తనను చైర్మన్‌గా చేశారంటూ జానారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇదే విషయమై ఏఐసీసీ సెక్రటరీ జనరల్స్‌ను, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ను ప్రశ్నించారు జానారెడ్డి. తాను ఆ కమిటీ చైర్మన్‌ బాధ్యతలు తీసుకోనంటూ స్పష్టం చేశారు. ఈ విషయంపై సెక్రటరీ శ్రీనివాస కృష్ణన్‌ నచ్చచెబుతున్నా.. జానారెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారని సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి చైర్మన్‌గా టీపీసీసీ చేరికల కమిటీని ఏఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read More : Prashant Kishore : టీఆర్‌ఎస్‌కు రాజకీయ వ్యూహకర్త మారబోతున్నారా ?

ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, సీనియర్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌ రాజనర్సింహలు సభ్యులుగా ఉన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదంతో ఏఐసీసీ వారిని నియమించింది. కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తి చూపే నేతల ప్రతిపాదనలను ఈ కమిటీ పరిశీలించి, ఒక నిర్ణయం తీసుకుంటుంది. టీఆర్‌ఎస్‌ ఎంపీ డి.శ్రీనివాస్‌ ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తిచూపుతున్నారు. అయితే వారి చేరికపై స్థానిక నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్లగా….దీనిపై కమిటీ వేశారు. ఈ కమిటీకి ప్రాధాన్యత లేదని జానారెడ్డి విముఖత చూపుతున్నారు.