కరోనా వేళ..గివేం కోరికలు : చికెన్ కావాలి..కండోమ్ లు పంపించండి

సార్..నాకు వెంటనే బిర్యాని పంపించండి..నాకు చికెన్ కావాలి..మటన్ లేదా చేపలు పంపించండి..నిద్రమాత్రలు తెప్పించండి..ఐస్ క్రీమ్..ఇలా ఏదో తోచితే..అది ఆర్డర్స్ ఇస్తున్నారు. వీటిని తెచ్చి ఇవ్వడానికి అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. కరోనా వేళ..ఇలాంటి కోరికలు అడుగుతారా ? అని తిట్టిపోస్తున్నారు. ఇదంతా కరోనా వైరస్ కారణంగా కంటైన్ మెంట్ ప్రాంతాల్లో జనాలు అడుగుతున్నారంట.

సార్..నాకు వెంటనే బిర్యాని పంపించండి..నాకు చికెన్ కావాలి..మటన్ లేదా చేపలు పంపించండి..నిద్రమాత్రలు తెప్పించండి..ఐస్ క్రీమ్..ఇలా ఏదో తోచితే..అది ఆర్డర్స్ ఇస్తున్నారు. వీటిని తెచ్చి ఇవ్వడానికి అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. కరోనా వేళ..ఇలాంటి కోరికలు అడుగుతారా ? అని తిట్టిపోస్తున్నారు. ఇదంతా కరోనా వైరస్ కారణంగా కంటైన్ మెంట్ ప్రాంతాల్లో జనాలు అడుగుతున్నారంట. నియంత్రణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, నిత్యావసరాలు, మందులు అడగడం మాములే. కానీ..కొన్ని ప్రాంతాల్లో కోరుతున్న గొంతెమ్మ కోరికలు అధికారులను, సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. అయినా..సరే..ఎంతో ఒపికగా…అడుగుతున్న వస్తువుల అవసరాల మేరకు పంపిస్తున్నారు.

కూకట్ పల్లి పరిధిలోని ఎల్లమ్మబండ ఖాజానగర్ లో ఏర్పాటు చేసిన కంటైన్ మెంట్ జోన్ లో కొందరు కండోమ్, ఐపిల్ తెచ్చుకుంటున్నారని సిబ్బంది వెల్లడిస్తున్నారు. దుకాణాలు బంద్ అయిన తర్వాత..కొందరు అవి..ఇవి తేవాలంటూ చెబుతున్నారని వాపోతున్నారు. వెస్ట్ జోన్ పరిధిలోని 14 కంటైన్ మెంట్ ఎక్కువ మంది చికెన్ కావాలని ఆర్డర్ వేస్తున్నారని, తమకు డబ్బు కావాలని అడుగుతూ..ఏటీఎం పిన్ నెంబర్లు చెప్పడం లేదని వాపోతున్నారు.

 

సికింద్రబాద్ పరిధిలోని కౌసర్ మసీదు వద్ద ఓ వ్యక్తి బిర్యానీ కావాలంటూ సిబ్బందితో గొడవకు దిగినట్లు సమాచారం. ఇంకొకరు ఏకంగా మద్యం బాటిల్ కావాలని, తనకు నిద్ర పట్టడం లేదు..నిద్ర మాత్రలు కావాలని మరొకరు అడిగారని వెల్లడిస్తున్నారు. ఇక పాతబస్తీ పరిస్థితి చెప్పనవసరం లేదు. బిర్యానీ, మటన్ కావాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఖైరతాబాద్ ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్ కంటైన్ మెంట్ జోన్ లో ఎక్కువ మంది మందుబాటిల్ తెప్పించాలని, బ్లాక్ లోనైనా తెప్పించాలని..ఎంతైనా డబ్బు ఇస్తామంటుండడంతో ఏమి చేయాలో అధికారులకు అర్థం కావడం లేదు. కొంతమంది సిగరేట్లు కావాలని అడుగుతున్నారంట. మొత్తానికి గొంతెమ్మ కోరికలతో అధికారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ..ఇన్నీ కావు.