Telangana : స్కూళ్లకు డుమ్మాకొట్టే టీచర్లకు బిగ్ షాక్.. విద్యాశాఖ సంచలన నిర్ణయం..

Telangana : తెలంగాణ విద్యాశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులకు బిగ్ షాకిచ్చింది.

Telangana Education Departments key decision

Telangana : తెలంగాణ విద్యాశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు గైర్హాజరవుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బందిపై చర్యలకు విద్యాశాఖ సిద్ధమైంది.

Also Read : Bank Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. ప్రముఖ బ్యాంకులో 250 రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు.. జీతం ఎంతంటే? పూర్తి వివరాలు ఇవే

ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా స్కూల్‌కు డుమ్మాకొడితే వారిపై ఇకపై ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపకూడదని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. విధులకు ఎగనామం పెట్టేవారిపై వెంటనే సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు ప్రారంభించాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఇష్టానుసారంగా స్కూళ్లకు డుమ్మాలు కొట్టే టీచర్లు, సిబ్బంది పట్ల విద్యాశాఖ కఠినంగా వ్యవహరించనుంది. అనుమతి లేకుండా కంటిన్యూగా ఏడాదిపాటు డ్యూటీకి రాకపోతే నిబంధనల ప్రకారం వారిని సర్వీస్ నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఐదేళ్లపాటు ఆబ్సెంట్ అయినవారు రాజీనామా చేసినట్లు భావిస్తామని పేర్కొంది. అలాంటి వారిపై చర్యలు తీసుకోవడంలో హెడ్‌మాస్టర్లు, ఎంఈవోలు, డీఈఓలు జాప్యం చేస్తే వారినే బాధ్యులను చేస్తూ వేటు వేస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ హెచ్చరించారు.

ప్రతి డీఈఓ కార్యాలయంలో విధులకు గైర్హాజరయ్యే టీచర్ల కోసం ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ నిర్వహించి, వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. అనుమతిలేని గైర్హాజరు కాలాన్ని డైస్ నన్ (పనిచేయని కాలం)గా పరిగణిస్తారు. ఈ కాలానికి సంబంధించి జీతభత్యాలు చెల్లించకపోవడమే కాకుండా, రాబోయే ఇంక్రిమెంట్లు, పింఛను వంటి ఆర్థిక ప్రయోజనాల్లో కూడా కోత విధిస్తారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో భాగంగానే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంది.