Indiramma Indlu: ‘ఇందిరమ్మ ఇండ్ల’ రెండో విడత కేటాయింపుపై కీలక ప్రకటన.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Indiramma Indlu Phase 2: రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు ప్రక్రియపై అధికార యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసింది.
- V Santhosh Kumar
- Updated on- August 20, 2026 / 12:32 PM IST
Telangana government announces second phase indiramma indlu housing scheme allotment
- రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు
- వచ్చే నెలలో కేటాయింపు ప్రక్రియ
- జీహెచ్‌ఎంసీ పరిధిలో లాటరీ పద్ధతి
Indiramma Indlu Phase 2: తెలంగాణలో సొంతింటి నిరీక్షణలో ఉన్న పేద ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రాష్ట్రాన్ని గుడిసెలు లేని పచ్చని ప్రాంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు ప్రక్రియపై అధికార యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. ఈ విడతలో నిరుపేదలకు, ముఖ్యంగా ప్రస్తుతం గుడిసెలలో నివాసముంటున్న అర్హులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఇళ్లను (Indiramma Indlu)మంజూరు చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ విసి మరియు ఎండీ గౌతమ్ అధికారులను ఆదేశించారు.
Also Read- Raipur Minor Girl: కన్న కూతురిపై తండ్రి అత్యాచారం.. గర్భందాల్చిన పాప.. రాయ్‌పూర్ ఆస్పత్రిలో అమానుషం
వచ్చే నెల 15 నాటికి ప్రక్రియ పూర్తి:
రెండో దశ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి సంబంధించిన అన్ని రకాల ప్రాసెస్ ప్రక్రియను వచ్చే నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులు గడువు విధించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక:
గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో ఇండ్ల కేటాయింపునకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 27వ తేదీ నుంచి రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున డ్రా తీయనున్నారు. అత్యంత పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు.
