Telangana Govt : గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ.. రూ.16వేల కోట్లతో.. ప్రారంభించనున్న సీఎం రేవంత్ ..
Telangana Govt : తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
- Harish Thanniru
- Updated on- August 12, 2026 / 07:21 AM IST
Telangana Government HAM model roads
- గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ
- రూ.16వేల కోట్లతో హ్యామ్ పనులు
- 30నెలల్లో పూర్తికానున్న రోడ్ల నిర్మాణ పనులు
Telangana Govt : తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో హైబ్రిడ్ యాన్యుటి మోడల్ (హ్యామ్) విధానంలో చేపట్టనున్న తొలి దశ రహదారి పనులకు సంబంధించి ఫైలాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈనెల 16వ తేదీన ములుగు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
హ్యామ్ విధానం కింద మొత్తం 17,300 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారులను మూడు దశల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 98 నియోజకవర్గాల్లో రూ.16,007.56కోట్లతో 7,450 కిలోమీటర్ల మేర 2,162 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారుల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 40శాతం కాగా.. మిగిలిన 60శాతం నిర్మాణ సంస్థలు సమకూరుస్తాయి.
ప్రభుత్వం తన వాటాను 15ఏళ్లలో 30 విడుతల్లో చెల్లిస్తుంది. నిర్మాణ సంస్థలు తమకు నిర్దేశించిన పనులను 30నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆపై 15ఏళ్ల పాటు రోడ్ల నిర్వహణ బాధ్యత నిర్వర్తించాలి.. హ్యామ్ రోడ్ల పనుల ప్రారంభోత్సవానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామీణ రహదారుల అభివృద్ధి కేవలం ప్రయాణ సౌకర్యానికే పరిమితం కాకుండా వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించడం, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు చేరుకోవటం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రావడం వంటి అనేక అంశాలకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గ్రామీణ రవాణా వ్యవస్థకు ఈ ప్రాజెక్టు కొత్త దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా.. గిరిజన, అటవీ ప్రాంతాలు అధికంగా ఉన్న ములుగు జిల్లాలో మెరుగైన రహదారి సదుపాయాలు అందుబాటులోకి వస్తే మారుమూల గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారులు కీలక మౌలిక వసతిగా నిలవనున్నాయని, ప్రతి గ్రామానికి నాణ్యమైన రహదారి కనెక్టివిటీ కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని దశలవారీగా అమలు చేస్తున్నామని
