Rythu Bharosa : రైతులకు బిగ్ అలర్ట్.. రైతుభరోసా నిధులు రావాలంటే వెంటనే ఇలా చేయండి.. దరఖాస్తుకు లాస్ట్ తేదీ ఇదే..

Rythu Bharosa : జూన్ 15వ తేదీ నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన, గతంలో సాంకేతిక కారణాల వల్ల రైతుభరోసా పథకం కింద లబ్ధి పొందని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.

Rythu Bharosa

Rythu Bharosa : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పంటల సాగు ప్రారంభంలో అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి పెట్టుబడి సాయం కింద నిధులు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఏడాదికి ఎకరానికి రూ.12వేలు చొప్పు రెండు విడతల్లో అందజేస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుతల వారిగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తోంది. ప్రస్తుతానికి నాలుగు విడతల్లో కలిపి 65.76 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6590.37 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసింది. అయితే, అర్హులైన అన్నదాతలు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read : Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షం.. హెచ్చరికలు జారీ..

జూన్ 15వ తేదీ నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన, గతంలో సాంకేతిక కారణాల వల్ల రైతుభరోసా పథకం కింద లబ్ధి పొందని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. వారు రైతు భరోసా పథకంకు దరఖాస్తు చేసుకోవడానికి జులై 5వ తేదీ వరకు చాన్స్ ఇచ్చింది.

అర్హులైన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)కి గానీ, మండల వ్యవసాయ అధికారి (ఎంఏవో)కి గానీ దరఖాస్తులు, ధ్రువపత్రాలు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తుతోపాటు పట్టాదారు పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ మొదటి పేజీ జిరాక్సు కాపీలతోపాటు రైతుభరోసా దరఖాస్తు ఫారాలను సమర్పించాలని పేర్కొంది. దరఖాస్తులు, ధ్రువపత్రాలు సమర్పించేందుకు జూలై 5 చివరి తేదీగా ప్రకటించింది. అయితే, ఇవాళ్టితో ఈ గడువు ముగియనుంది. వెంటనే అర్హులైన రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని తాజాగా అధికారులు సూచించారు. అయితే, ఈ దరఖాస్తు గడువును పెంచే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. వ్యవసాయశాఖ అధికారులు సీసీఎల్‌ఏ డేటా ఆధారంగా దరఖాస్తులు తీసుకొని.. రైతుభరోసా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తే లబ్ధిదారుల జాబితాలో కొత్త రైతులు చేరిపోతారు.