Telangana Unemployed: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిరుద్యోగులకు శుభవార్త..
Telangana Govt Unemployed: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్‌లలో వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
- Harish Thanniru
- Updated on- May 8, 2026 / 10:18 AM IST
CM Revanth Reddy
Telangana Govt Unemployed: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్‌లలో వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2022లో అప్పటి ప్రభుత్వం నిరుద్యోగులకు పదేళ్ల వయసు సడలింపునివ్వడంతో జనరల్ అభ్యర్థులకు 44ఏళ్లు, రిజర్వ్ డే కేటగిరీలకు 49ఏళ్లు, దివ్యాంగులకు 54ఏళ్ల వరకు అవకాశం లభించింది. అయితే, ఈ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థుల వయో పరిమితిని ఐదేళ్లు పెంచాలా.. లేదా పదేళ్లు పెంచాలా అనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అయితే, జనరల్ అభ్యర్థులకు ఐదేళ్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు పదేళ్లు సడలింపు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు సంఘాలు మాత్రం.. అన్ని వర్గాలకు సమానంగా పదేళ్లు పెంచితేనే న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read : తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఐదు రోజులు వానలు.. హెచ్చరికలు జారీ.
రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లకు వయో పరిమితి పెంచాలని ఇప్పటికే శాసనసభ, శాసన మండలి విప్‌లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్క్షప్తి చేశారు. బుధవారం ఎమ్మెల్సీ కోదండ రామ్, అద్దంకి దయాకర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి పదేళ్ల పాటు సడలించాలని కోరారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సుదీర్ఘకాలం నోటిఫికేసన్లు రాకపోవడం, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం భర్తీ ప్రక్రియను నిర్లక్ష్యం చేయడంతో లక్షలాది మంది అభ్యర్థులు నష్టపోయారని తెలిపారు. దీంతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
