Rythu Bharosa : రైతులకు అదిరిపోయే న్యూస్.. రైతు భరోసా మూడో విడతకు లైన్ క్లియర్.. అకౌంట్లలోకి డబ్బులు అప్పుడే..
Rythu Bharosa : మూడో విడత రైతు భరోసా నిధులను జమ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రక్రియను మొదలు పెట్టింది. రూ.12వేల కోట్లు సమీకరించేందుకు బాండ్లను వేలానికి పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ కు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.
- Harish Thanniru
- Updated on- April 29, 2026 / 10:12 AM IST
Telangana government
- రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
- రైతు భరోసా మూడో విడతకు లైన్ క్లియర్
- మే నెలలో రైతుల ఖాతాల్లో జామకానున్న నిధులు
Rythu Bharosa : రైతులకు పంటల సాగు సమయంలో ఆర్థికంగా భరోసాగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతీయేటా రెండు విడుతల్లో ఎకరాకు రూ.12వేల చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది రబీకి సంబంధించి రెండు విడతల్లో రెండు ఎకరాలు కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. అయితే, మూడో విడతలో నాలుగు ఎకరాలలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది.
Also Read : TS 10th Results 2026 : నేడే పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇక్కడ చెక్ చేసుకోండి..
ఈ ఏడాది రబీకి సంబంధించి తొలి విడతలో లబ్దిదారులకు రూ.3,446 కోట్లు, రెండో విడత కింద రూ.2,206కోట్లు జమ చేసింది. తొలి విడతలో 68,89 లక్షల మందికి లబ్ది చేకూరగా.. రెండో విడతలో 45.11 లక్షల మంది బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి. అయితే, మే నెలలో మూడో విడత నిధులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
మూడో విడత రైతు భరోసా నిధులను జమ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రక్రియను మొదలు పెట్టింది. రూ.12వేల కోట్లు సమీకరించేందుకు బాండ్లను వేలానికి పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ కు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వేలం ద్వారా వచ్చిన సొమ్మును రాబోయే ఆరు నుంచి 25ఏళ్లలో చెల్లించనుందని తెలుస్తోంది. ఏడు నుంచి 7.5శాతం వడ్డీకే వీటిని తీసుకోనుందని సమాచారం.
ఇప్పటికై హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వానికి నిధులు కావాల్సి ఉంది. రూ.15వేల కోట్లు మెట్రో స్వాధీనానికి అవసరం అవుతాయి. దీంతో రానున్న రెండు నెలల్లో రైతు భరోసా, మెట్రో స్వాధీనం, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం రూ.12వేల కోట్లు సమీకరించేందుకు ప్రభుత్వం రెడీ అయింది.
