×
Ad

హైదరాబాద్ లో హైస్పీడ్ రైల్వే జంక్షన్ వచ్చేది ఇక్కడే..! ఇక్కడ పెట్టుబడి పెడితే డబుల్ కి ట్రిబుల్..!

Telangana Govt : హైదరాబాద్ ముఖచిత్రాన్ని మరింత మార్చే హైస్పీడ్ (బుల్లెట్) రైళ్ల టెర్మినల్‌ను శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న బహదూర్‌గూడ భూముల్లో ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.

High speed Rail

  • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • బుల్లెట్ రైళ్ల హబ్‌గా శంషాబాద్
  • బహదూర్‌గూడలో హైస్పీడ్ రైల్వే టెర్మినల్
  • ఇటీవలే హద్దులు గుర్తించిన అధికారులు

Telangana Govt : తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. శంషాబాద్ ప్రాంతాన్ని హైస్పీడ్ రైళ్ల హబ్‌గా మార్చాలని భావిస్తోంది. ఈ మేరకు అధికారులు చకచకా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Also Read : Rythu Bharosa Scheme : రైతులకు గుడ్‌న్యూస్.. ‘రైతు భరోసా’ డబ్బులు వచ్చేస్తున్నాయ్.. కానీ, ఈసారి వాళ్లకే.. ఖాతాల్లో జమయ్యేది ఎప్పుడంటే?

హైదరాబాద్ ముఖచిత్రాన్ని మరింత మార్చే హైస్పీడ్ (బుల్లెట్) రైళ్ల టెర్మినల్‌ను శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న బహదూర్‌గూడ భూముల్లో ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన భూసేకరణపై కూడా అధికారులు దృష్టి కేంద్రీకరించారు.

దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైల్వే కారిడార్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో మూడు కారిడార్లు హైదరాబాద్‌తో అనుసంధానం అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి పుణె, బెంగళూరు, చెన్నై మార్గాల్లో ఈ హైస్పీడ్ రైలు కారిడార్లు నిర్మించనున్నారు. అయితే, ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రైల్వే మంత్రిని కలిశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే హైస్పీడ్ రైలు మార్గాలను ప్రారంభించాలని కోరారు. ఈ కారిడార్ కోసం శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో 500 ఎకరాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

శంషాబాద్ ప్రాంతంలోని బహదూర్‌గూడలోని సర్వే నంబరు 28, 62లోని 650 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించిన హద్దులను ఇటీవలే ప్రభుత్వం గుర్తించింది. వీటిని మరోసారి సర్వే చేయనున్నట్లు తెలిసింది. ఈ భూములను స్థానికులు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఆయా రైతులకు కొంత పరిహారం అందించి భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

హైస్పీడ్ రైల్ కారిడార్లతో మధ్య, దక్షిణ భారతాన్ని అనుసంధానించే కేంద్రంగా హైదరాబాద్ మారనుంది. దేశ మౌలిక సదుపాయాల రంగంలో అత్యంత కీలక రాష్ట్రంగా తెలంగాణ అవసరిస్తుందని, తద్వారా దేశ రాజకీయాల్లో కూడా తెలంగాణ ప్రాధాన్యం పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు.. ఈ ప్రాంతం అంతర్జాతీయ బిజినెస్‌కు గేట్‌వేగా అభివృద్ధి చెందే అవకాశముంది.

హైస్పీడ్ కారిడార్‌లో నడిచే బుల్లెట్ రైళ్లు గంటకు 300 నుంచి 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. దీంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రోడ్డు లేదా రైలు మార్గాల్లో ప్రయాణం చేసేందుకు ప్రస్తుతం 8 నుంచి 11 గంటల సమయం పడుతుంది. అదే.. హైదరాబాద్ – బెంగళూరు మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ అందుబాటులోకి వస్తే కేవలం రెండు గంటల్లోనే గమ్యస్థానాలకు చేరుకొనే అవకాశం ఉంటుంది.