×
Ad

New Liquor Brands : మందు బాబులకు గుడ్‌న్యూస్.. త్వరలో ఆ మద్యం బ్రాండ్లు వచ్చేస్తున్నాయ్..! 600కుపైగానే..

New Liquor Brands : మందుబాబులకు ఎగిరిగంతేసే వార్త. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతించేందుకు నిర్ణయించింది.

New liquor brands

New Liquor Brands : ప్రపంచంలో కొన్ని వేల రకాల మద్యం బ్రాండ్లు ఉన్నాయి. కానీ, మందుబాబులు ఎక్కువగా తాగేది బీరే. కొంతమంది కొత్త వెరైటీలు టేస్ట్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనూ కొన్ని మద్యం బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొత్త బ్రాండ్లు, విదేశీ బ్రాండ్లు కావాలని చాలా మంది కొరుకుంటుంటారు. అయితే, వారి కోరిక ఫలించేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వాలని డిసైడ్ అయింది.

Also Read : Raitu Bharosa : రైతులకు శుభవార్త.. ‘రైతు భరోసా’ డబ్బులు మీ ఖాతాల్లో పడేది ఆరోజే.. లైన్‌క్లియర్.. కానీ..

రాష్ట్రంలో త్వరలో నూతన మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు గతంలో ప్రభుత్వం చేసిన కసరత్తు తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. ఆ ప్రక్రియను తాత్కాలికంగా ప్రభుత్వం విరమించుకున్నది. అయితే, ప్రభుత్వం తాజాగా బడ్జెట్లో రాబడి అంచనాలను పెంచుకునేందుకు ఉన్న మార్గాలపై ఆరా తీయడంతో ఈ నిర్ణయం అమలు చేయనుందని తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 1,956 బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే మరో 604 మద్యం బ్రాండ్లు రాష్ట్రంలోకి అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్నాయి. వీటి అనుమతి కోసం సుమారు 92 కంపెనీలు ఉండగా.. ఇందులో బ్లెండర్స్ ప్రైడ్, రాయల్ ఛాలెంజ్, సులావైన్ వంటివి ఇక్కడ ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్లు ఉన్నాయి. కొత్తగా రాబోతున్న వాటిలో 15 విదేశీ బ్రాండ్లు, 15 దేశీయ లిక్కర్, 7 బీర్ బ్రాండ్లు, 37 కొత్త బ్రాండ్లు ఉన్నాయని తెలుస్తోంది.

ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులకు భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) పట్టుబడింది. ఆ మద్యం సీసాల్లో లోకల్ బ్రాండ్లు లేకపోవడం, విదేశీ బ్రాండ్ మద్యం అక్రమ తరలింపు గుర్తించారు. ఈ ఎన్డీపీఎల్‌లో అత్యధికశాతం మన దగ్గర అందుబాటులో లేని జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లు ఉంటున్నాయని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్న బ్రాండ్లకు అనుమతి లభిస్తే ఈ ఎన్టీపీఎల్ సమస్య తగ్గుతుందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు.

కొత్తవాటికి అనుమతిస్తే.. ఒక్కో బ్రాండు రూ.15 వేల చొప్పున అనుమతి ఫీజును వసూలు చేయనున్నారు. తద్వారా రూ.90,45,000లు ప్రభుత్వానికి రాబడి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని వివాదాస్పద మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అప్పటికే సదరు కంపెనీల నేపథ్యం వివాదాస్పదంగా ఉండటం, కొన్నిచోట్ల అవి కల్తీ మద్యం విక్రయించాయని తేలడంతో ప్రభుత్వం వాటితో ఒప్పందాలు రద్దు చేసుకున్నది. ఈ క్రమంలో అప్రమత్తమైన ఎక్సైజ్శాఖ వివాదాస్పద కంపెనీలను పక్కనపెట్టిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయిపోయాక.. కొత్త బ్రాండ్లకు గేట్లు తెరవాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది. అంటే.. మార్చి లేదా ఏప్రిల్‌లో కొత్త మద్యం బ్రాండ్లు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. ఇక అప్పుడు చూడాలి.. మందుబాబుల ఆనందం… మామూలుగా ఉండదు.