Liquor Prices: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. తెలంగాణలో మద్యం ధరల పెంపు?
తెలంగాణలో మద్యం(Liquor Prices) ప్రియులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
- V Santhosh Kumar
- Published on- July 17, 2026 / 07:54 AM IST
Telangana government to hike liquor prices.
- తెలంగాణలో మద్యం ధరల పెంపు
- కొత్తగా చిన్న మద్యం సీసాలు
- మందుబాబులపై భారీ ఆర్థిక భారం
Liquor Prices: తెలంగాణలో మద్యం ప్రియులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ముడిసరుకుల ధరలు, రవాణా ఖర్చులు పెరగడంతో మద్యం ధరలను(Liquor Prices) సవరించాలని తయారీ సంస్థలు చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల నిర్ణయ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో ధరల పెంపునకు సంబంధించిన తుది నివేదికను కమిటీ ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.
సాధారణ వినియోగదారులపై పడనున్న భారం:
ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం సాధారణ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే చీప్ లిక్కర్‌పై రూ. 90 వరకు, ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై రూ. 100 వరకు, అలాగే హయ్యర్ క్యాటగిరీ బ్రాండ్లపై గరిష్టంగా రూ. 120 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే బీర్లు, లిక్కర్ ధరలను పెంచగా, తాజాగా మూడోసారి ధరల సవరణకు రంగం సిద్ధమైంది.
