Telangana Employees : ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బీమా ఆఫర్! విమాన ప్రమాదానికి రూ.3 కోట్ల వరకు పరిహారం
Telangana Employees : ఒక్క రూపాయి భారం లేకుండా రూ కోటి 25 లక్షల ఉచిత ప్రమాద బీమా అందించనుంది. త్వరలోనే 'క్యాష్‌లెస్' హెల్త్ కార్డ్స్ అందించనుంది. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- June 25, 2026 / 08:10 PM IST
Accident Insurance Cover
Telangana Employees : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజా ప్రభుత్వం బంపర్ బీమా ఆఫర్ ప్రకటించింది. ఒక్క రూపాయి భారం లేకుండా రూ. 1.25 కోట్ల వరకు బీమా కవరేజ్ అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, తాత్కాలిక, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందితో పాటు అలాగే పింఛన్‌దారులకు భారీ ప్రయోజనం అందించేలా ప్రభుత్వం కొత్త ప్రమాదబీమా పథకాన్ని అమలు చేయనుంది. రూపాయి ఖర్చు లేకుండానే రూ.1.25 కోట్ల వరకు ఉచిత ప్రమాద బీమా రక్షణ కల్పించనున్నట్టు రేవంత్ సర్కార్ ప్రకటించింది.
రూ. 3 కోట్ల వరకు పరిహారం :
విమాన ప్రమాదాల్లో ఉద్యోగికి మరణం సంభవిస్తే కొన్ని బ్యాంకులు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పరిహారం అందించనున్నాయి. అలాగే ఇతర ప్రమాదాల్లో కూడా భారీ స్థాయిలో ఆర్థిక రక్షణ అందనుంది. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికీ ఈ పథకం వర్తించనుంది.
త్వరలోనే క్యాష్‌లెస్ హెల్త్ కార్డ్స్ :
అదే సమయంలో దేశంలోనే ఫస్ట్ టైమ్ రాష్ట్ర ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు జమ చేయడం, త్వరలోనే క్యాష్‌లెస్ హెల్త్ కార్డ్స్ ప్రవేశపెట్టడం వంటి కీలక నిర్ణయాలను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటోంది.
ఇదిలా ఉండగా, ఈ బీమా పథకంపై పలు బ్యాంకులు ఇప్పటికే తమ పరిహార వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి. గురువారం రవీంద్రభారతిలో జరిగిన సమావేశంలో ఈ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఒక్కో బ్యాంకు వేర్వేరు నిబంధనలతో బీమా కవరేజ్ అందిస్తోంది.
Read Also : CM Revanth Reddy : తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు..!
పెన్షన్‌దారుల కోసం ప్రత్యేక పథకాలను అందిస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘సురక్ష నెట్’పథకంలో నెలకు రూ.10వేలకు పైగా పెన్షన్ తీసుకునేవారికి ప్రమాదంలో మరణం లేదా శాశ్వత వైకల్యానికి రూ.15 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.7.5 లక్షల పరిహారం అందుతుంది.
అదే విధంగా ‘సన్మాన్ 60’పథకం కింద 60 ఏళ్లు దాటిన వారికి ఖాతాలో సగటు నిల్వ రూ.10వేలు ఉంటే.. రూ.15 లక్షల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. ‘సుయాష్’ పథకంలో నెలకు రూ.50వేలకు మించిన నిల్వ ఉంటే రూ.30 లక్షల వరకు బీమా వర్తిస్తుంది.
ఇండియన్ బ్యాంక్‌లో పెన్షన్ పొందే వారికి ప్రమాద బీమా కవరేజ్ రూ.60 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఈ మొత్తం లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భద్రతతోపాటు నమ్మకం కల్పించే దిశగా దోహదపడతాయని ప్రభుత్వం అంటోంది.
