Azharuddin Kodandaram MLC Status : రేవంత్ సర్కార్ కి భారీ ఊరట.. అజారుద్దీన్ మంత్రి పదవిపై క్లారిటీ.. ఆ MLCల నియామకానికి గవర్నర్ ఆమోదం

Azharuddin Kodandaram MLC Status : అజారుద్దీన్, కోదండరామ్ రెడ్డిలకు భారీ ఊరట లభించింది.

telangana governor approves mlc status for kodandaram and azharuddin posts

  • రేవంత్ సర్కార్ కి బిగ్ రిలీఫ్
  • ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి 
  • గవర్నర్ ఆమోదం

Azharuddin Kodandaram MLC Status : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్ల ఉత్కంఠకు నేటితో తెర పడింది. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా.. ఏప్రిల్ 25, శనివారం ఇద్దరు ఎమ్మెల్సీలు అజారుద్దీన్, కోదండరామ్ అభ్యర్థిత్వాలను ఆమోదించారు.

దీంతో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించిన ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలను ఆమోదిస్తూ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా సంతకం చేశారు. త్వరలోనే దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.

తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపై గత మూడు సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. ఈ నెల 30 లోగా ఎమ్మెల్సీగా ఆమోదం పొందకపోతే.. అజారుద్దీన్‌ మంత్రి పదవి కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను త్వరగా పరిశీలించాలని గవర్నర్‌ను ఇటీవల కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించిన పేర్లను ఆమోదిస్తూ గవర్నర్‌ తాజాగా సంతకాలు చేశారు.