Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఆ సమస్యకు చెక్..!

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

telangana govt decided to add 60 new coaches to hyderabad metro

  • హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
  • రద్దీ తగ్గించేందుకు కొత్త కోచ్ లు
  • 60 కొత్త కోచ్ ల కొనుగోలు

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. మెట్రోలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి చెక్ పెట్టేందుకు గాను సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా.. త్వరలోనే మెట్రో రైళ్లలో కొత్త కోచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఆఫీసులకు వెళ్లేవారితో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. దీనితో పాటు వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. చాలా మంది మెట్రో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మెట్రోలో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. కనీసం కాలు పెట్టేందుకు కూడా స్థలం లేక.. ప్రయాణికులు తర్వాతి రైళ్ల కోసం చాలా సేపు ప్లాట్‌ఫారమ్‌లపైనే వేచి చూడాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కరించేందుకు గాను సర్కార్.. కొత్త కోచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది.

ప్రస్తుతం నగరంలోని మూడు ప్రధాన కారిడార్లలో మొత్తం 56 మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. అయితే, ప్రతి రైలుకు కేవలం 3 కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. దీంతో రోజురోజుకూ పెరుగుతోన్న మెట్రో ప్రయాణికుల రద్దీకి ఇవి ఎంతమాత్రం సరిపోవడం లేదు. ఈ క్రమంలో దీన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు వీలుగా మెట్రో రైళ్లలో అదనపు కోచ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులు చాలా కాలంగా భావిస్తున్నారు. ఇటీవల మెట్రోను ప్రభుత్వం తన ఆధీనంలోకి (స్వాధీనం) తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతే ఈ ప్రక్రియ ఊపందుకుంది.

*హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. IAS, IPSలతో కొత్త బోర్డు.. ఇక పూర్తిగా సర్కార్ పరం

ప్రయాణికుల ఇబ్బందులను గమనించిన తెలంగాణ ప్రభుత్వం.. తక్షణ ఉపశమనం కోసం దాదాపు 60 కొత్త మెట్రో కోచ్‌లను కొనుగోలు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ కొత్త కోచ్‌ల తయారీ, సరఫరా బాధ్యతలను.. బెంగళూరుకు చెందిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ‘భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్’ (BEML)కి అప్పగించనున్నారని.. దీని గురించి అధికారులు ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిపారని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ రెండు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం కుదరనుంది.

*హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. మీ లగేజీ కోసం స్మార్ట్ లాకర్లు..

ఈ కోచ్‌ల కొనుగోలుపై అధికారికంగా ఒప్పందం జరిగితే.. కేవలం 15 నెలల వ్యవధిలోనే ఈ కొత్త కోచ్‌లను నగరానికి సరఫరా చేస్తామని బీఈఎంఎల్ వెల్లడించింది. ఈ కొత్త కోచ్‌లు గనుక అందుబాటులోకి వస్తే రైళ్ల ఫ్రీక్వెన్సీ (రైళ్ల మధ్య సమయం) తగ్గడంతో పాటు, సీటింగ్ సామర్థ్యం కూడా భారీగా పెరుగుతుంది. దీనివల్ల నిల్చోని ప్రయాణించే కష్టాలు తప్పడమే కాకుండా, నగర వాసులకు అత్యంత సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతి లభించనుంది.