×
Ad

Telangana Govt : సొంతిల్లు కావాలనుకునే వారికి భారీ శుభవార్త.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో తక్కువ ధరకే సింగిల్ బెడ్ రూం ప్లాట్స్..

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు రేవంత్ సర్కార్ ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల పథకంతో అర్హులైన ప్రతిఒక్కరికీ సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. తాజాగా.. తక్కువ ధరకే సింగిల్ బెడ్రూం ఇళ్లను విక్రయించేందుకు సిద్ధమైంది.

Also Read : Cold Wave Warning : వామ్మో.. భీకరమైన చలి.. సింగిల్ డిజిట్‌కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాల్లో స్కూల్ టైమింగ్స్ మార్పు

రాష్ట్రంలోని ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడంలో తనదైన ముద్ర వేసుకున్న హౌసింగ్ బోర్డు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రత్యేకంగా ఎల్‌ఐజీ వర్గాల (లోయర్ ఇన్ కమ్ గ్రూప్) కోసం ప్లాట్లను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లోని మొత్తం 339 ప్లాట్లను అందుబాటులోని ధరలతో విక్రయిస్తోంది.

వారికి మాత్రమే అవకాశం..
అల్పాదాయ వర్గాల ప్రజలకు (ఎల్ఐజీ) నుంచి వసతులతో కూడిన సొంతింటి వసతిని కల్పించాలన్న ఉద్దేశంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. అవన్నీ కూడా అభివృద్ధి చెందిన, అత్యధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని ప్లాట్లే అని చెప్పారు. బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువ ధరలతోనే విక్రయిస్తున్నట్లు చెప్పారు. వివిధ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో హౌసింగ్ బోర్డు వీటిని నిర్మించాయని, ఏడాదికి రూ.6లక్షల (నెలకు రూ.50వేలు) ఆదాయం ఉన్న వారికే వీటిని కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఏ జిల్లాల్లో ఎన్ని ప్లాట్లు ఉన్నాయంటే?
హైదరాబాద్ గచ్చిబౌలి లోని 111 ఫ్లాట్లు, వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని అపార్ట్ మెంట్‌లో 102, ఖమ్మంలో శ్రీరామ్ హిల్స్ వద్ద 126 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనుగోలు చేయడానికి ఆస్తక్తితో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న వారికి పూర్తి పారదర్శకమైన విధానంలో లాటరీ పద్దతిలో కేటాయిస్తామన్నారు.

ప్లాట్ల విస్తీర్ణం.. ధర ఇలా..
ప్లాట్ల విస్తీర్ణం 450 చదరపు అడుగుల నుంచి 650 చదరపు అడుగుల వరకు ఉందని, గచ్చిబౌలి ప్రాంతంలోని ప్లాట్ల ధర రూ.26లక్షల నుంచి గరిష్ఠంగా రూ.36.20 లక్షలు వరకు మాత్రమే ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో రూ.19 నుంచి రూ.21.50లక్షల వరకు.. ఖమ్మంలో రూ.11.25లక్షలకే అందుబాటులోకి తెచ్చామని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతం

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
ప్లాట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ ద్వారా లేదంటే మీ సేవా కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. గచ్చిబౌలి ప్రాంతం ప్లాట్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ జనవరి 6వ తేదీన ఉంటుందని తెలిపారు. అదేవిధంగా వరంగల్లోని ప్లాట్ల కేటాయింపు జనవరి 8వ తేదీన, ఖమ్మంలోని ప్లాట్ల లాటరీ జనవరి 10వ తేదీన నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ విక్రయాలకు సంబంధించిన వివరాలన్నీ హౌసింగ్ బోర్డు వెబ్ సైట్ https://tghb.cgg.gov.inలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.