Cold Wave Warning : వామ్మో.. భీకరమైన చలి.. సింగిల్ డిజిట్‌కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాల్లో స్కూల్ టైమింగ్స్ మార్పు
Cold Wave Warning: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాత్రి, ఉదయం వేళల్లో
Hyderabad Cold winds
Cold Wave Warning: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. దీంతో రాత్రి, ఉదయం వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. వచ్చే వారం రోజులు చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఉదయం, రాత్రివేళల్లో వృద్ధులు, చిన్నారులు బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చినా చలి తీవ్రతను తట్టుకొనేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : Group 3 Results: గ్రూప్ 3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రిజల్స్ట్ విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
తెలంగాణలో చలిపులి వణికిస్తోంది. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కుమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 5.7 నుంచి 6.5 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ పేర్కొంది.
రాష్ట్రంలో అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లా సర్పూర్ (యు)లో 5.7 డిగ్రీలు నమోదైంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సాధారణం కన్నా 5.7డిగ్రీలు తగ్గి 6.4 నమోదైంది. హనుమకొండలో 4డిగ్రీలు తగ్గి 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదిలాబాద్ జిల్లాలో నాలుగు డిగ్రీలు తగ్గి 7.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో చలి తీవ్రత కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఐదు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తీవ్రమైన చలి దృష్ట్యా అదిలాబాద్ జిల్లా కలెక్టర్ పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అదిలాబాద్ జిల్లాలోని పాఠశాలల పనివేళలను మార్చుతూ కలెక్టర్ రాజర్షిషా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 9.40 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పనివేళలను అమలు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర్వులు అమలు చేయని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పాఠశాల సమయంలో మార్పులు చేసినట్లు తెలిపారు.
