Alishetty Prabhakar: దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం

అలిశెట్టి ప్రభాకర్‭కు డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ను ఇప్పించేందుకు తన కార్యాలయాన్ని ఆదేశించారు కేటీఆర్. వెంటనే స్పందించిన హైద్రాబాద్ కలెక్టర్.. అసీఫ్ నగర్‭లోని జియాగూడలో నిర్మించిన డబుల్ బెడ్రూంని కేటాయించారు.

Alishetty Prabhakar: దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం

Updated On : September 29, 2023 / 8:17 PM IST

Double Bedroom Alishetty Prabhakar: తెలంగాణ కవి, దివంగత అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. అలిశెట్టి కుటుంబానికి మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించారు. జగిత్యాల జిల్లాకు చెందిన అలిశెట్టి ప్రభాకర్.. చిత్రకారుడుగా, ఫోటోగ్రాఫరుగా, అభ్యుదయ కవిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సామాన్యులకు జరిగే అన్యాయాలపై కలం పోరాటం చేసిన సృజనాత్మక కవి అలిశెట్టి ప్రభాకర్. పేదరికంలో ఉన్న అలిశెట్టి కుటుంబానికి సహాయం అందించే చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్‭కు సీఎం ఆదేశించారు. అలిశెట్టి ప్రభాకర్‭కు డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ను ఇప్పించేందుకు తన కార్యాలయాన్ని ఆదేశించారు కేటీఆర్. వెంటనే స్పందించిన హైద్రాబాద్ కలెక్టర్.. అసీఫ్ నగర్‭లోని జియాగూడలో నిర్మించిన డబుల్ బెడ్రూంని కేటాయించారు.