CM Revanth Reddy
TG New Ration Cards: కొత్త రేషన్ కార్డులకోసం ఎదురు చూస్తున్న తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రస్తుతం 80లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 1 నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని భావించినప్పటికీ ఆ ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టలేదు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తొలగిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని అందరూ భావించారు. కానీ, ప్రస్తుతం రేవంత్ సర్కార్ రేషన్ కార్డుల పంపిణీ కోసం కొత్త తేదీని ప్రకటించింది.
Also Read: Gossip Garage : కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్.. వనపర్తిలో ఆ ఇద్దరి మధ్య ముదిరిన వివాదం..
కొత్త రేషన్ కార్డు నమూనాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు. లేత నీలి రంగులో ఈ కొత్త రేషన్ కార్డును తయారు చేయాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా రేషన్ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డి ఫొటోతోపాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉండే విధంగా రేషన్ కార్డు నమూనాని ఖరారు చేశారు. దీనికితోడు రేషన్ కార్డుపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: Vijaya milk: రైతులకు గుడ్‌న్యూస్.. విజయ పాల సేకరణ ధరలు పెంపు యోచనలో ప్రభుత్వం.. ఎంతంటే?
రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలనే ఓ స్పష్టమైన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అర్హులను ఫైనల్ చేసింది. అయితే, ఇంకా కొన్ని ప్రాంతాల్లో అర్హుల ఎంపిక విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఎప్పుడనే విషయంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే, ప్రభుత్వం ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. ఉగాది నాటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. మార్చి30వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ. ఆ రోజున కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.