Indiramma Sarees Distribution : తెలంగాణ మహిళలకు శుభవార్త.. ఆ ఉచిత పథకం మళ్లీ వస్తోంది.. ఇసారి మరింత అందంగా
Indiramma Sarees Distribution : తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది.
- Dharani Pilli
- Updated on- April 11, 2026 / 03:36 PM IST
Telangana indiramma Sarees Scheme 2026 with New Design Color for Women
- మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త
- ఈ ఏడాది కూడా ఇందిరమ్మ చీరలు
- ఈసారి మరో కొత్త కలర్, డిజైన్
Indiramma Sarees Distribution : తెలంగాణలోని మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. గతేడాది రాష్ట్రంలోని మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన రేవంత్ సర్కార్.. ఈ సంవత్సరం కూడా వాటిని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం పంపిణీ చేసిన చీరలకు మంచి ఆదరణ లభించింది. గతంలో బీఆర్ఎస్ మాదిరిగా కాకుండా.. చాలా నాణ్యమైన చీరలు పంపిణీ చేశారని జనాలు హర్షం వ్యక్తం చేశారు. ఆఖరికి మహిళా మంత్రులు కూడా వాటిని కట్టుకుని మురిసిపోయారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈసారి మరో కొత్త రంగు, డిజైన్‌తో చీరలు తీసుకురాబోతున్నారట. గతంలో నీలం రంగు చీరలు పంపిణీ చేయగా… ఈసారి వాటి స్థానంలో చిలకపచ్చ రంగు చీరలను ఎంపిక చేశారు. ఇందిరమ్మ చీరల కోసం ఇప్పటికే సెర్ప్.. టెస్కోకి కోటి చీరల తయారీ కోసం రూ.450 కోట్ల ఆర్డర్ ఇచ్చింది.
*ఇందిరమ్మ చీరలు వచ్చేస్తున్నాయ్.. పంపిణీకి సిద్ధంగా 50లక్షల శారీస్.. ఒక్కో చీర తయారీకి ఖర్చు ఎంతంటే?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గత సంవత్సరం ఇందిరా గాంధీ జయంతి నవంబర్ 19న రేవంత్ సర్కార్ ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించింది. క్రితం సంవత్సరం రాష్ట్రంలో 86 లక్షల మందికి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈసారి ఈ సంఖ్య మరింత పెరగనుందంటున్నారు. అలానే ప్రతిసారీ ఒకే రంగు చీరలు కాకుండా.. ఏటా ఒక్కో కొత్త రంగు చీరను పంపిణీ చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సెర్ప్, మెప్మాల సీఈవోలు పలు నమూనాలను సిద్ధం చేయించారు. వాటిలో చిలకపచ్చ రంగు, ఎరుపు జరీ డిజైన్‌తో గల చీరను సీఎం ఎంపిక చేశారు.
క్రితంసారి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేర్వేరుగా ఇందిరమ్మ చీరల పంపిణీ విడివిడిగా కాకుండా.. ఈసారి అందరికీ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందిరమ్మ చీరల తయారీ కోసం.. టెస్కో.. కరీంనగర్, వరంగల్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల్లోని 11 ప్రాంతాల్లోని నేత కార్మికులకు చీరల తయారీ పని అప్పగించబోతున్నారు. అక్టోబరు నాటికి చీరలను సిద్ధం చేస్తే నవంబరు 19న తిరిగి ఇందిరాగాంధీ జయంతికి పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.
